by Naveen Rjy on Monday, August 22, 2011 at 4:28pm on facebook note
తెలుగు ని ఆదరించిన పుణ్యం. ….

రాజమండ్రి లో ఇపుడు రాజరాజనరేంద్రుని వెయ్యో సంవత్సర పట్టభిషేక వారోత్సవలు జరుగుతున్నాయి. ఇవాళమహాభార తాన్ని ఊరేగించారు. మనం మాట్లాడుకునే మాటల్లొ చెప్పాలంటే రాజరాజనరేంద్రుడు వీరుడుకాదు శూరుడుకాదు సాహసికాదు. పరాక్రమవంతుడుకాదు. ఆయన ఏ యుద్ధంలోనూ గెలవలేదు. క్రమ క్రమంగా రాజ్యంలో భాగాలను పోగొట్టుకున్నవాడు. పూర్తిగా మామగారి మీద ఆధార పడిపిచ్చాపాటి మాటలతో కాలక్షేపంచేసినమామూలు రాజుగారు. అయితే తెలుగు భాషాభిమానమే రాజరాజనరేంద్రుని చిరంజీవిగా మన ముందుంచింది. తెలుగుభాషాపరంగా ఏదైనా చేయాలనుకున్న ఈ రాజు గారు తన క్లాస్ మేట్ నారాయణ భట్టు ని ఆపని చేయమన్నాడు. కన్నడ పండితుడైన భట్టు ఆ పనికి నన్నయ భట్టు ని సూచించాడు. ఆవిధంగా రాజరాజమహేంద్రుని కొలువులో నన్నయ చేరారు . రాజు కుటుంబ పురోహితునిగా కూడా నన్నయ వుండేవారు. నన్నయ రాసిన మొదటి గ్రంధం తెనుగు వ్యాకరణం. అందులో 90 పాళ్ళు సంస్కృతంలోనే వుండటం నన్నయకే నచ్చలేదట. అప్పుడు భారతాన్ని తెనిగిస్తాననడం రాజు ఒప్పుకోవడం జరిగాయి.

మూడుభాగాలుగా తెలుగుభారతం రాసిన కవిత్రయం లో చివరివాడైన ఎర్రాప్రగ్గడ 200 ఏళ్ళ తరువాత , అప్పటికే మరణించిన రాజరాజ నరేంద్రునికే తాను అనువదించిన భాగాన్ని అంకితం ఇచ్చారంటే ఆ పనిని ప్రోత్సహించిన రాజరాజనరెంద్రుని ప్రభావం ఎంతగా వుందో అర్ధం చేసుకోవచ్చు.

మొదటిసారి 1924 ఆగస్టు 17 న రాజమండ్రి లో రాజరాజనరేంద్రుని 900 వ సంవత్సర పట్టాబిషేక మహోత్సవం జరిగింది.చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఆ తేదీని నిర్ధారించడమే కాక స్వయంగా ఆ వేడుకలో పాల్గున్నారు. తరువాత ఇప్పుడు రాజమంద్రిలో ఆంధ్రకేసరి యువజన సమితి , కళాగౌతమి సంస్థ విడి విడిగా వేడుకలు జరుపుతున్నాయి. యువజనసమితి లెక్క ప్రకారం ఆగస్టు 22న కళాగౌతమి లెక్క ప్రకారం ఆగస్టు 17 న రాజరాజనరేంద్రునికి పట్తాభిషేకం జరింగింది. ఈ తేడాలు పెద్ద వివాదం కాదు. ఒక రాజుని వెయ్యేళ్ల తరువాత కుడా గుర్తుండటమే విషేశం

సాక్షి సబ్ ఎడిటర్ బలుసు కామేశ్వరరావుగారు ఇంటికొచ్చి భారతం ఊరేగింపు ఇపుడే అయ్యింది అనే దాకా విషయం తెలియదు. యధాప్రకారం పీపర్లు జోనల్ పేజీల్లో నాలుగు సెంటీమీటర్ల వార్త వేస్తాయి.జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనా మాల గొడవలో మునిగిపోయిన టివి లు ఈ విషయాన్నే పట్టించుకోవు. నేను ట్రాన్స్ ఫర్ అయి రాజమంద్రి వచ్చిన కొత్తలో గౌతమి గ్రంధాలయానికి వెళ్ళి అక్కడ అధికారి శర్మ గారితో మాట్లాడి చరిత్ర గుర్తులు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుని ప్రతీ ప్రదేశాన్నీ చూసి ఫొటోలు తీయించి ఈనాడు సండే మగ్జైన్ల్ లో రాజరాజనరేంద్రుడి స్టోరీ రాశాను. అప్పట్లోనే కోటిలొంగాల పేటలో పచ్చటి శాలువా కప్పుకున్న ఒక పండితుడు సైకిల్ తొక్కుకుంటూ వెడుతున్నారు..ఆయన మొహంలో ఏదో వెలుగు చూసి నన్నయగారు ఈయనేమో అనిపించింది.నమ స్కారం పెట్టి వుంటే బాగుణ్ణనిపించింది అప్పుడు ఒక కవిత రాశాను (భయపడకండి ఇప్పుడు అది లేదు మిమ్మల్ని ఇక విసిగించబోవడం లెదు.)

కేవలం తెలుగుని ఆదరించి ప్రోత్సహించినందుకే రాజరాజనరెంద్రుదు వెయ్యెళ్ళుగా సజీవంగా వున్నారు
మరి మేనేజిమెంట్ ప్రొఫెషనల్స్ దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు ?
పేషన్ ( ఇష్టపడి) చేసే పని ఎటర్నల్ అంటారా ????