తడి ఆర్చుకుపోయినపుడు, రక్తంలో అక్సిజన్ అంతరించి శరీరంలో ఏఅవయవానికీ పోషకపదార్ధం అందని స్ధితే వడదెబ్బకు మరణించడం అంటే. విపరీతమైన ఎండ శరీరంలో తడిని ఆవిరిచేస్తూంది. చెమటలు పట్టంలేదు కాబట్టి సురక్షితమనుకుంటే పొరపాటే! ఎండమండిపోతున్నా దాహంవేయడంలేదు కాబట్టి నీళ్ళుతాగఖ్ఖరలేదనుకుంటే ప్రాణాంతకమే! విజ్ఞానం సాధించిన మనుషులకు ఇది ఎంతవరకూ అర్ధమైందో తెలియదుకాని, ప్రకృతే నేర్పిన జ్ఞానంతో తేనెటీగలు తడారిపోకుండా తమను తాము కాపాడుకుంటున్న ఈ సన్నివేశం సమస్త ప్రాణులకూ ఎండలగండాన్ని సూచిస్తోంది.