Search

Full Story

All that around you

Month

June 2013

రూపాయి పతనంతో గాడ్జెట్ ‘వ్యసనాల’ ధరాభారాన్నితట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్న గ్లోబల్ సామాన్యులమైపోతున్నాం


టివి, మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఉహించుకోలేని ఎలకా్ట్రనిక్ “వ్యసన”పరులమైపోయాం. లాప్ టాప్ లాంటి నానారకాల గాడ్జెట్టుల్నీ వ్యసనాల జాబితాలో చేర్చేసుకుంటున్నాం. మనుషులు దూరమైపోతున్నా వస్తువులే లోకమై బతికేస్తున్నాం. గ్లోబలీకరణనవల్ల హద్దులు చెరిగిపోయి ప్రపంచం 24 గంటల దూరానికి దగ్గరైపోయిందని మురిసిపోతున్నాం . . నాణ్యమైనవాటిని ధరతక్కువైన వాటిని ఏమూలలున్నా పట్టుకుని వాడుకోవచ్చని ఆన్ లైన్ హొయలు పోతున్నాం. 
అయితే పతనమౌతున్న రూపాయి విలువని నిలువరించలేక గాడ్జెట్ ‘వ్యసనాల’ ధరాభారాన్నితట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్న గ్లోబల్ సామాన్యులమైపోతున్నాం 
రూపాయి పతనం ఆర్థికవ్యవస్థే కే కాదు  అందరి జేబులకూ చిల్లు పెడుతోంది. భారీగా తగ్గుతున్న రూపాయి విలువతో దిగుమతి చేసుకుంటున్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇందులో మనం నిత్యం వాడే వస్తువులు కూడా ఉన్నాయి. 
గత రెండేళ్ల కాలంలో రూపాయి విలువ 30 శాతం పతనమయింది.  మే నెల నుంచి ఇప్పటిదాకా 8.5 శాతం పైనే తగ్గింది. రెండేళ్ల కిందట 43 రూపాయిలుగా ఉన్న రూపాయి మారకపు విలువ మేలో 53 స్థాయిలో ఉంటే ప్రస్తుతం 58 రూపాయిల 39 పైసల వద్ద ఉంది. అంటే నెల రోజుల వ్యవధిలో సుమారు 500 పైసల పైగా పతనమైంది. 
ఈ పతనం నానారకాలుగా  ప్రభావం చూపుతోంది.  దిగుమతుల బిల్లు పెరుగుతుంది. ఫలితంగా మనం వాడే కొన్ని వస్తువల ధరలు ప్రియం కానున్నాయి
కంప్యూటర్లు, లాప్ ట్యాప్ లు, ట్యాబెట్ లు, స్మార్ట్ ఫోన్లు,కార్లు, టీవిలు, ఇంపోర్టెడ్ లిక్కర్,ప్రీమియం పుడ్, లగ్జరీ ఐటమ్స్ ల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత రూపాయి పతనంతో దిగుమతి చేసుకుంటున్న కన్జూమర్ గూడ్స్ ధరలు 20 నుంచి 25 శాతం ప్రియం కానున్నాయి. రూపాయి విలువ ఒక్క శాతం తగ్గితే ఇంపోర్టెడ్ పుడ్ విలువ 3 నుంచి 4శాతం వరకు పెరుగుతుంది. అదే లిక్కర్ ధర 6 శాతం,గృహోపకరణాల ధర 2 నుంచి 3 శాతం వరకు పెరుగుతుంది. ఇక విదేశీ ప్రయాణం మరింత ఖరీదు కానుంది.ఫారిన్ టూర్ ప్యాకేజీల ధరలు 5 నుంచి 8 శాతం వరకు పెరిగే  అవకాశం ఉంది.
ఇప్పటికే కొన్ని వస్తువులపై ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఈ నెలఖారులోగా తమ కంప్యూటర్లపై ధరలను 5 నుంచి 8 శాతం పెంచుతున్నట్లు లెనోవా తెలుపగా, 10 శాతం వరకు పెంచుతున్నట్లు ఏసర్, 8 శాతం పెంచుతున్నట్లు హెచ్ సీఎల్ ప్రకటించింది. 
రకరకాల ఎల్ట్రకానిక్ ఉపకరణాల ధరలను  ఈ నెలఖారులోగా 2 నుంచి 5 శాతం వరకు పెంచే అవకాశం ఉందని ఎల్ జి, సాంసంగ్, పానసోనిక్ లు తెలిపాయి.

e రీడర్ మీద ఇ చదువు నాకొక తృప్తికరమైన అనుభవం


మంచో చెడో ఒక టెక్నాలజీలో సౌకర్యాన్ని చూశాక అలాంటి సౌకర్యం లేకుండా పనిచేసుకోవడం ఎవరికీ నచ్చదు. నేను “ఇ చదువు” కూడా అలాగే మొదలుపెట్టాను.
వ్యాసాలు,విశ్లేషణలు, సామాజికాంశాలు, కథలు…ఇలాంటి పుస్తకాలు ఇంట్లో మూడు అల్మైరాల్లో కిక్కిరిసిపోయి వున్నాయి. ఎదోపుస్తకంతీసి చదువు మొదలుపెడితే ఏకబిగిన పూర్తిచేయడానికి ముప్పై ఏళ్ళక్రితం నాటి తీరికా ఓపికా కుదరడంలేదు. 
కినిగే (kinige.com) ఇపుస్తకాలు నాకొక పరిష్కారం అనిపించాయి. అక్కడ కొన్న పుస్తకాలను అడోబ్ డిజిటల్ ఎడిషన్ (ADE Free Download) లో సర్దుకుని  డెస్కటాప్, లాప్ టాప్, లలో చదువుకోవడం మొదలు పెట్టాను. పుస్తకాలను  iPad లో Bluefire Reader (Free Down load) లోకి బదిలీచేసుకున్నాక చదువుకోవడంలో సౌకర్యం బాగా పెరిగింది. 
అయితే ఐపాడ్ లో స్రీ్కన్ వెనుకనుంచి వచ్చే కాంతి వల్ల కళ్ళు లాగి ఎక్కువసేపు చదవడం ఇబ్బంది కరమయ్యింది. ప్రత్యామ్నాయాల అన్వేషణలోనే ఇరీడర్ గురించి నాకుతెలిసింది. సోని రీడర్ ebay లో కొని అందులోకి పుస్తకాలు బదిలీ చేశాను. ఇరీడర్ మీద మొదటిసారి తెలుగుపుస్తకాలు చదవడం నాకొక అద్బుతమైన అనుభవం. 130 గ్రాముల పరికరంలో 200 పుస్తకాలు ఇముడ్చుకుని ఎక్కడికైనా వెంటతీసుకువెళ్ళగలగడం నిజమేనా అనిపించేటంత ఆశ్యర్యకరమైన నిజం
ఇంక్ టెక్నాలజీ తో తయారైన రీడర్లు ఇతర మొబైల్, టాబ్లెట్టు ల మాదిరిగా చదువుతూంటే కళ్ళు లాగవు. ఒకపుస్తకాన్ని చదువుతున్న అనుభవమే వుంటుంది. పుస్తకం లాగే రీడర్లకు కూడా లైట్లు వుండవు. లైటువెలుగులోనే పుస్తకం చదువుకోవాలి…మొన్న మొన్నటి వరకూ రీడర్లమీదకూడా లైటు వెలుగులోనే పుస్తకాలు చదువుకోవలసి వచ్చేది. (విడిగా అమర్చుకునే బ్యాటరీ లైట్లు రీడర్లకోసం తయారుచేయడం మొదలైంది)
కంటికి శ్రమ లేకుండా రీడర్ లోనే లైటు అమర్చడం kindle white paper, Nook, Kobo glo లతో మొదలైంది. కినిగే పుస్తకాలు తెరుచుకునేదీ, తక్కువ బరువుదీ అయిన “కోబోగ్లో” రీడర్(ఇబెలో అమ్మకానికి అప్పుడు లేదు) అమెరికాలో వున్న మిత్రుడి ద్వారా తెప్పించుకున్నాను
“కోబోగ్లో”తో రాత్రివేళ కూడా గదిలో లైటువేయకుండా కళ్ళు మండకుండా హాయిగా చదువుకోగలుగుతున్నాను. (పగటిపూట చదువు కుదరటంలేదు)
అయితే తెలుగుపుస్తకాల్ని తెరవడంలో లైటులేని “సోనీ”కున్న సదుపాయాలన్నీ లైటున్న కోబోలో లేవు
ఈఫొటోలో రెండురీడర్లనూ చూడవచ్చు. అది కాళీపట్నం రామారావుగారి రచనల పుస్తకంలో ‘అదృశ్యము’ కథ పేజీ.
కోబోలో ఫాంటునిగాక పేజిని ఎన్లార్జి చసుకునే వీలుంది. చదివేవీలైన సైజుకి పేజీని పెంచడంవల్ల రెండు కాలమ్స్ ఫార్మేట్ లోవున్న పేజీలో రెండో కాలం కూడా పక్కనే కనబడుతోంది.
సోనీలో పేజీనిగాక ఫాంటునే పెంచుకునే సౌకర్యంవుంది. ఇందువల్ల రెండో కాలమ్ సోనీ రీడర్ మీద కనబడటంలేదు.
పేజీనిగాక ఫాంటునే పెంచుకోగలగడం ఎక్కువ సౌకర్యంకదా!
స్మార్ట్ ఫోన్లకంటే తక్కువ ధరకే (130 అమెరికన్ డాలర్లకు) రీడర్లు దొరుకుతున్నాయి. తెలుగు పుస్తడాలు చదువుకోడానికి సోని రీడరే సదుపాయంగా వుంది. దానికి ఇన్ బిల్ట్ లైటు లేకపోవడమే చిన్న అసౌకర్యం. దానికి ప్రత్యామ్నాయంగా లైటు అమర్చివున్న లెదర్ కేసు మార్కెట్ లోకి వచ్చింది. ఇబే లో దాన్ని తెప్పించాను. రెండో ఫోటోలో అది చూడవచ్చు 
అయితే మనం చదివే పుస్తకాల ప్రచురణ కర్తల సలహా లేకుండా రీడర్లు కొంటే ఒక వేళ ఆపుస్తకాలు రీడర్ మీదతెరచుకోకపోతే ప్రయోజనం నెరవేరదు. నేను కినిగే కిరణ్ గారి సలహా సూచనల మేరకే రీడర్లు కొన్నాను. 
కొన్నేళ్ళకు మళ్ళీ రోజూ కొంతసేపైనా తృప్తిగా చదువుకోగలుగుతున్నాను.
(ఇ రీడింగ్ గురించి ఆలోచిస్తున్న మిత్రులకు నా అనుభవం ఒక పరిశీలన కావచ్చన్న ఆలోచనతో ఇది మీముందుంచుతున్నాను)

రాత్రి – పగలు సయ్యాట!


‘ఎంకి ఎవ్వరంటే ఎలుగు నీడల వైపు వేలు సూపింతు’ అంటాడు నాయుడు బావ. 
అలాంటి వెలుగు నీడలు, రాత్రీ పగలు ఒకే ఫ్రేములో కనబడుతున్న ఈ అపురూప దృశ్యాన్ని అంతరిక్షం నుంచి ‘కొలంబియా’ ఫొటో తీసింది. యూరప్ – ఆఫ్రికా ల మధ్య ఒక్క మేఘమూ లేని నిర్మలాకాశం లో సూర్యుడు అస్తమిస్తున్న(?) ఈ సన్నివేశంలో యూరప్ నిద్రపోతూండగా ఆఫ్రికా మేల్కొంటూ వుండటాన్ని చూడవచ్చు. ఎడమవైపు కనబడుతున్నది అట్లాంటిక్ మహాసముద్రం. కుడి వైపు చీకటిగా వున్నది యూరప్. దాని దిగువ తెల్లగా కనిపిస్తున్నది ఆఫ్రికా. దీపాలు వెలుగుతున్న యూరప్ లో హాలెండ్, పారిస్, బార్సిలోనా నిద్రపోతున్నాయి. అదే యూరప్ లోని డబ్లిన్, లండన్, లిస్టన్, మాడ్రిడ్ లలో ఇంకా చీకటి పడలేదు. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో పగలూ రాత్రీ కనబడుతున్న ఈ సన్నివేశాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది శాస్త్రవిఙ్ఞానానికీ, సాంకేతిక పరిఙ్ఞానానికీ మనిషెత్తు సాక్ష్యం

Create a free website or blog at WordPress.com.

Up ↑