Search

Full Story

All that around you

Month

August 2013

కెసిఆర్ తెచ్చిన అలజడి …సర్వీసుల రక్షణ ఎలా


ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్ లేదు వెనక్కి ( 610 జిఒ ప్రకారం వారివారి జోన్లకు వారు)వెళ్ళిపోవాలి అని కెసి ఆర్ నిన్న అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ వేడిలో ఆమాటలు “హైదరాబాద్ నుంచి ఉద్యోగుల్ని తరిమేస్తామని కెసిఆర్ అన్నట్టు” మారిపోయాయి. కెసిఆర్ మాటలు ఉద్యోగులకు బాగానే అర్ధమయ్యాయి. 
ఉద్యోగాలకు ముప్పేదీ లేకపోయినా ఆమాటలు తమలో వత్తిడి పెంచుతున్నాయని ఇప్పటి వాతావరణంలో ఆమాటలు భౌతికదాడులకు ప్రోత్సహిస్తాయన్న భయం కలుగుతోందని ఉద్యోగులు అంటున్నారు
ఈ మాటలన్నందుకు అన్నిపార్టీల నాయకులూ కెసిఆర్ ని దుమ్మెత్తిపోస్తున్నారు. 
ఒక జోన్ కి చెందిన ఒక అధికారి మరోజోన్ లో వున్న ఒక పట్టణంలో డెప్యుటేషన్ మీద పనిచస్తున్నాడు.  ప్రమోషన్ మీద ఆసీటు లోకి రావడానికి స్ధానిక జోన్ అధికారి ఒకరు పడిగాపులు పడుతున్నారు ఆయన ఈ సీట్ లోకి వస్తే ఆయన కింద మరొక ఉద్యోగికి ప్రమోషన్ వస్తుంది.డెప్యుటేషన్ లో వున్న  అధికారి సీటు వదిలితేగాని ఇదంతా జరగదు. ఈయన వదలడు రిటైర్ మెంటు ఇంకా రెండున్నర ఏళ్ళే కాబట్టి ఇక్కడే వుంచే ‘ఆప్షన్’ ని ఆమోదించాలని నెల్లూరాయన టి్రబ్యునల్ నుంచి స్టే తెచ్చుకున్నాడు.  ఇలా హైదరాబాద్ లో తిష్టవేసిన వందల మంది ఉద్యోగులకు ‘ఆప్షన్’వుండదని వెనక్కి వెళ్ళిపోవలసిందేనని కెసిఆర్ చెప్పారు. తన ప్రాతం ఉద్యోగుల మొరేల్ పెంచడం కెసిఆర్ ఇలాగే మాట్లాడుతారు.
ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు, విశాలాంధ్రగా విస్తరణ, ముల్కీ నిబంధనలు, తెలంగాణా ఉద్యమం, జై ఆంధ్రా ఉద్యమం, 6 సూత్రాల పధకం, 610 జిఒ, రాష్ట్ర విభజన మొదలైన ఆనేక పరిణామాలలో మారుతూ వస్తున్న నిబంధనల వల్ల కష్టసుఖాలు పడుతున్న ప్రభుత్వోద్యోగులకు భద్రతకు చట్టబద్దమైన ఏర్పాట్లు జరగాలి.
రెండు రాషా్ట్రలు ఏర్పడినా మూడు రాషా్ట్రలు ఏర్పడినా రాయలసీమ ఆంధ్రా ప్రాంతాల ఉద్యోగుల సర్వీసు ప్రోటెక్షన్ ఈ విధంగా చేవచ్చేమో పెద్దలూ ఉద్యోగసంఘాల వారూ పరిశీలించాలి.
+జూనియర్ అసిస్టెంట్లు, ఫస్ట్ గెజిట్, ఉపాధ్యాయులు, రాష్ట్రపతి ఉత్తర్వు (1973) కింద నాన్-లోకల్ కోటాలో నియమితులైన వారిని ప్రస్తుత ం వారు పనిచేస్తున్న జిల్లాలో, జోన్లో ఉద్యోగ విరమణ వరకు కొనసాగించాలి. +ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండదలచుకున్నారో ఆ రాష్ట్రంలో ఉండనివ్వాలి. నిర్బంధంగా సొంత ప్రాంతానికి పంపించకూడదు. ఒక కమిటీని నియమించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ప్రతి ఉద్యోగి అభిప్రాయాన్ని గుర్తించి గౌరవించాలి. ఉద్యోగసంఘాల నాయకుల నిర్ణయం ప్రకారం ఉద్యోగులను ఏ రాషా్ట్రనికి  కేటాయించాలనే దాన్ని నిర్ణయించకూడదు. +కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగుల పదోన్నతి అవకాశాలు, ప్రస్తుత రాష్ట్రం కొనసాగితే ఎలా ఉంటాయో అలానే ఉండాలి. +విభజన అనంతరం పదోన్నతికి ఉద్యోగి పుట్టిన తేదీని కనీసం ఐదు సంవత్సరాల వరకు ప్రమాణంగా తీసుకోకూడదు. సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతి కల్పించాలి.
-పెద్దాడ నవీన్ 

సీమాంధ్ర-సీమ&ఆంధ్ర! ఎన్ని రాషా్ట్రలు?


రాష్ట్రవిభజన నిర్ణయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని టి ఆర్ ఎస్ నమ్మలేకపోతోంది. ఇందులో పాటించిన గోప్యత రాష్ట్రంలో కాంగ్రస్ నే ఇరకాటంలోకి నెట్టి రాజీనామాలు చేసేటంతగా వత్తిడిని పెంచింది. రాహుల్ ని ప్రధానిగా చేయగల విధంగా సీట్లు పెంచడానికే రాషా్ట్రన్ని సోనియా చీల్చేశారన్న విమర్శ నిజమే అనిపిస్తుంది. చంద్రశేఖరరావు స్వార్ధం కోసమే తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టారన్న విమర్శా నిజమే అనిపిస్తుంది. అయితే తెలంగాణా రాష్ట్రం కోసం 60 ఏళ్ళుగా డిమాండ్ వుండటం, ప్రత్యేక రాష్ట్రంకావాలన్న ఆకాంక్ష అక్కడి ప్రజల్లో నానాటికీ బలపడటం నిజంగా నిజం. ఇదే నిజం కాకపోతే తెలుగుదేశం పార్టీ విభజనకు అంగీకరించేది కాదు. జగన్ పార్టీ కి ఆప్రాంతంలో తుడిచిపెట్టుకు పోయే అవస్ధ దాపురించేది కాదు.
కారణాలూ మూలాలూ ఏమైనా సుదీర్ఘకాలపు డిమాండులో ఒక దశాబ్దపుపోరు ఫలితంగా ఒక ప్రధాన ఘట్టం ముగిసిపోయింది. తదుపరి దశగా హద్దుల ఖరారు జరుగుతుంది. సీమాంధ్రగా పాపులర్ అయిన భావన సమ్మతమో కాదో లోతుగా ఆలోచించుకోవాలి.కర్నూలు ని రాజధాని చేయకపోతే రాయలసీమ ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండు ఇప్పటికే వచ్చింది.
ఒకే తరహా సంస్కృతి, చరిత్ర, జీవన విధానం, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో వుండటం మొదలైన అంశాలు జన సమూహాల్ని ఒకే ఐడెంటిటితో (అస్ధిత్వం) చూపిస్తాయి. సైజులో చిన్నా పెద్దా అన్నది చూడకుండా ఇలాంటి ఐడెంటిటీతో వున్న ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా మారిస్తే మంచి ఫలితాలు వుంటాయి. చిన్న రాషా్ట్రల వల్ల బడుగు బలహీనవర్గాల వారు అధికారంలోకి రావడం రాజకీయ చైతన్యమైతే వేగంగా అభివృద్ది సాధించడం ఆర్ధిక చైతన్యమౌతుంది. ఈ దృషా్ట్య రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు అర్ధవంతమైన చర్యే అవుతుంది. ఆరునూరైనా ఏదిఏమైనా పనిసాధించుకునే ధృక్పధంవుండే రాయలసీమ, ఘర్షణ ధోరణిని ఆలోచనల్లోకే రానీయని ఆంధ్రా ప్రజల మధ్య కంపాటబిలిటీ సమస్యలు కూడా తలెత్తకుండా చూడటమెలా అన్నది కూడా ఈ సందర్భంగా పెద్ద ప్రశ్నే అవుతుంది. రాయలసీమకు ఒక రాషా్ట్రన్నీ ఆంధ్రాకు మరొక రాషా్ట్రన్నీ ఏర్పాటు చేయడమే ఇందుకు ఖచ్చితమైన పరిష్కారం అవుతుంది.
సీమాంధ్రా లేక సీమ, ఆంధ్ర రాషా్ట్రలా అనే అంశాన్ని లోతుగా పరిశీలించి ప్రజల్లో ఏకాభిప్రాయం కలిగించే పనికి ఎవరు పూనుకుంటారన్నదే అసలు ప్రశ్న. ఆతరువాత రాజధాని లేదా రాజధానులు ఎక్కడుండాలి అనేది మరో ప్రశ్న. మేధావులు ఆలోచనాపరులు నిపుణులు చొరవతీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. సోషల్ నెట్ వర్కుల ను ఉపయోగించుకుని ఆప్రతిపాదనలను విస్తృతంగా చర్చకు పెట్టవచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ఒక ప్రాజెక్టు రిపోర్టంత సాధికారికంగా వుండాలేతప్ప అభిప్రాయంలా ఇష్టంలా వుండకూడదు.
రాజీనామాల “ఇబ్బంది”లో వున్న కాంగ్రెస్, తెలుగుదేశం, జగన్ పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు చొరవ తీసుకుని హేతుబద్ధమైన శాస్త్రీయమైన ప్రతిపాదనలతో ప్రజాభిప్రాయాన్ని రూపొందింపజేయడానికి పూనుకోవాలి.
ఎన్ని రాషా్ట్రలు, రాజధాని/రాజధానులు ఎక్కడుండాలి అనే విషయాల్లో కొంతైనా కసరత్తు జరగకపోతే కేంద్ర ఉపసంఘమే తుది నిర్ణయాలు తీసుకునే ప్రమాదముంది. అపుడు మళ్ళీ నష్టపోకుండా ఇప్పటినుంచే వివరాలు విశ్లేషించుకుని ప్రతిపాదనలతో సిద్ధమవ్వాలి.
-పెద్దాడ నవీన్ 

ఆవేశకావేశాలూ సరే! బురదపులుముకునే రాజకీయాలూ సరే!! దారి చూపే పెద్దలు ఏరి


ఎదురుచూడని రైలు వచ్చి,ఆగి, తేరుకునేలోగానే వెళ్ళిపోయినందుకు పా్లట్ ఫారం మీదున్న జనంలో ఆందోళన గందరగోళాలు అరుపులు కేకలు మొదలయ్యాయి. ఆగుంపుల్లో పార్టీలనాయకులు, ముఖ్యమైన వ్యక్తులని పేరుపడిన నానారకాలమనుషులు, డబ్బులున్నవాళ్ళు, నోరున్నవాళ్ళు, తెల్లబట్టలవాళ్ళు నోటికొచ్చినట్టల్లా మాట్లాడేస్తున్నారు. 
ఇదంతా వీళ్ళవల్లేనని వాళ్ళూ, వాళ్ళవల్లేనని వీళ్ళూ తగాదాపడుతున్నారు. రైలుని వెనక్కి తెచ్చేద్దం మరేం ఫరవాలేదని కొందరు ఆవేశ పడిపోతున్నారు. అసలురైలే వెళ్ళలేదని ఇంకొందరు కొందరు పెద్దలు విశ్లేషణలు చేసేస్తున్నారు. 
సమైక్యాంధ్రా జిందాబాద్ అనీ అన్నిపార్టీలూ డౌన్ డౌన్ అంటూ బస్సులు ఆపేసీ, షాపులు మూయించేసీ, బొమ్మలు తగలబెట్టేసీ యువకులు ఉద్యమించడాన్ని నేర్చుకుంటున్నారు.
రాష్ట్రవిభజన నిర్ణయం ప్రకటితమైనప్పటినుంచీ రాయలసీమ ఆంధ్రా ప్రాంతాల్లో పరిస్ధితి ఇది. ఎవరి పాత్రలను వారు బాగానే నిర్వహిస్తున్నారు. 
అయితే వాస్తవాలను విడమరచి దారిచూపే పెద్దమనుషులు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు(ఒకప్పుడున్న సామాజిక నాయకత్వం ఇపుడు అంతరించిపోయింది-న్యూస్ టివిలు పెద్దమనుషుల్లాగే కనిపించినా అవి ఎగదోసే నాశనకారులు మాత్రమేనని అందరికీ బాగానే అర్ధమైపోతోంది)
1)రైలుని వెనక్కిరప్పించే(కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని రద్దుచేయించే)శక్తి, సామర్ధ్యం టివీల్లో అరుపులు పెడబొబ్బలు పెట్టే కెమేరా వీరులకుగాని,పదవులకు రాజీనామాలు చేసిన చేస్తామంటున్న కాంగ్రెస్ వాళ్ళకుగాని లేవని ప్రజలు గ్రహించాలి
2)తెలుగుదేశం పార్టీ లేఖవల్లే ఈ పరిస్ధితి వచ్చిందని ఆడిపోసుకుంటున్న కాంగ్రెస్ వారు – 2004 లోనే సాక్షాత్తూ సోనియాగాంధీ తెలంగాణా ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకోవాలి. సమస్యను నాన్చి ముదరబెట్టిన కాంగ్రస్ వైఫల్యాన్ని ఇతరుల నెత్తిన రుద్దడం ఎంత సమంజసమో ఆలోచించుకోవాలి. 
3)వత్తిడి పెంచడానికి ఆందోళనలు అలజడులు సరే! ఆగొడవసాగిస్తూనే రేపటి కార్యక్రమమేంటో కూడా నిర్ణయించుకోవాలి. తెలంగాణా ఏర్పాటుచేయాలన్న అధికారపార్టీ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం అమలుచేయడం మొదలుపెడుతుంది.అందుకోసం కేబినెట్ కమిటీ పని మొదలుపెట్టేటప్పడికే ఉమ్మడి రాజధానిలో రెండులేదా మూడు రాషా్ట్రల హక్కులు ఏమిటీ అజమాయిషీ ఎవరిది మొదలైన అంశాలపై అవగాహనకు రావాలి. హెచ్చు అవకాశాలకోసం వాదనలు సిద్దం చేసుకోవాలి (టివిల్లోకాదు టివిల్లోనే ఈ దుకాణం పెడితే ప్రయోజనాలు సర్వనాశనమైపోతాయి)
4)పదేళ్ళో ఎంతోకొంతకాలం ఉమ్మడి రాజధాని తప్పదుకాబట్టి రాయలసీమనుంచి, ఆంధ్రానుంచి హైదరాబాద్ లో చేరేవరకూ కనీసం రెండు మూడు రోడ్ల మార్గం పొడవునావున్న ప్రాంతాలను సీమాంధ్ర రాష్ట్రం హద్దుల్లోకి వచ్చే నోటిఫికేషన్ చేయించుకోవాలి లేకపోతేసొంత యింటికిచేరుకునే దారి కోసం పొరుగువాళ్ళని బతిమిలాడుకునే అవస్ధతప్పకపోవచ్చు
5) చండీఘడ్ ఉమ్మడిరాజధాని గా వుండటం మూలాన పంజాబ్ హర్యానా రాష్టా్రల సమస్యలేమిటో అధ్యనం చేయాలి
6)విభజన హద్దులు ఏమిటి?రాజధాని – రాయలసీమ ఆంధ్రాలు వేర్వేరు రాషా్ట్రలైతే రాజధానులు ఎక్కడ మొదలైన విషయాలపై ఒక అవగాహనకు రావాలి 
కేబినెట్ ఉపసంఘం పని బహుశ నెలరోజుల్లో మొదలౌతుంది అప్పటికి ఈ అంశాలతో సిద్దం గా లేకపోతే ఉపసంఘం తనకు అందుబాటు /వీలైన విషయాలనే ఖరారు చేసేస్తుంది. (అస్ధులు అప్పులు పంపకాలు తరువాత దశలకు వస్తాయి) అంటే రెండో రైలుకూడా ప్రజలతో నిమిత్తం లేకుండానే వెళ్ళి పోవడమన్నమాట
రాజకీయవేత్తలు మాత్రమే ఈపనులన్నీ చేయలేరు చేయరు కూడా మేధావులు ఆలోచనాపరులు నిపుణులు ఇందులో మార్గాలను వెతకాలి పెద్దమనుషులు వీరినందరినీ రాజకీయవేత్తలతో అనుసంధానం చేయాలి. 

Create a free website or blog at WordPress.com.

Up ↑