నాకు క్రికెట్ గురించి ఏమీతెలియదు. ఎలా అడతారోతెలియదు. విజయవాడలో ఈనాడు టె్రయనీ రిపోర్టర్ గా వున్నపుడు రంజీటో్రఫీ జరిగింది. న్యూస్ ఎడిటర్ వాసుదేవరావుగారు పిలిచి స్టోరీలు ఏమి ఇస్తున్నావని అడిగారు. ఏర్పాట్లు స్టేడియం ముస్తాబులు వగైరా వగైరా అనిచెప్పాను. కాస్త సంకోచంగానే నాకుక్రికెట్ రాదు కవరేజి ఎవరితోనైనా చేయిద్దాం అన్నాను. ఆయన సీరియస్ గాఅదెలాకుదురుతుంది. చాలా టైముందిగా నేర్చుకో అన్నారు. అసలు ఆటేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను చికాకు అనిపించి వొదిలేశాను.
మ్యాచ్ కి ఒక రోజు ముందు రిపోర్టింగ్ ఎవరికైనా అప్పగించండి అని అడిగితే నవ్వుతూ అదెలా కుదురుతుంది నీకు చేతొచ్చినంతరాయి. నేను తిరగరాస్తా అన్నారు. 
ఆట ముగిసేదాకా అర్ధమయ్యీ అర్ధమవ్వకా పక్కనే వున్న ఆంధ్రపత్రిక ప్రకాశ్ శాస్త్రి గారిని అదేపనిగా విసిగించి సిగ్గుపడి ఇదన్నమాట క్రికెట్ అనితెలుసుకుని ఆఫీస్ కివెళ్ళి రిపోర్టు రాసి వాసుదేవరావుగారికి ఇచ్చాను. మొత్తం చదివి ఓ నవ్వు నవ్వి నా చేతికిచ్చేసి ఇది ఈనాడులో అచ్చయితే బాగోదు అన్నారు. నేను రాస్తాలే అన్నారు. ఏజెన్సీ కాపీ కొసం చూడకుండా పెన్ను ఆపకుండా కాపీ రాసేశారు. నాకు ఆశ్చర్యం నోట్సులేకుండా ఎలా అని. క్యాంటీన్ దగ్గర నళినీరంజన్ గారు చెప్పారు “ఆయనకు క్రికెట్ ఒక పిచ్చి అని కళ్ళు మూహసేసుకుని రేడియోకామెంటీ్ర వింటూ ఆట చూసేస్తారని” 
మరుసటిరోజు కవరేజి మీద బయటి నుంచి నాకు వచ్చిన ప్రశంసలు సిగ్గుపడిపోయేలా చేశాయి. కాంప్లిమెంట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ఆపెన్ వాసుదేవరావుగారిదని వివరించుకున్నాను. ఈ పరిస్ధితి కొన్ని రోజులపాటు వుంది.
రిపోర్టింగ్ లో భాష పదాలు అమరిక శక్తిని అర్ధం చేసుకుని అభ్యాసం చేయడానికి ఆ అనుభవం నాకు ఉపయోగపడింది. ఎందుకో క్రికెట్ మీద ఆసక్తి రాలేదు. ఇప్పటికీ ఆ ఆటగురించి తెలియదు. మ్యాచ్ ల కాలంలో టివి భార్యాపిల్లలకు అప్పగించేసి ఏదైనా చదువుకోవడమే నేను చేస్తున్న పని. 
సచిన్ పట్ల అభిమానం తెలుస్తూనే వుంది.అదెందుకో నాకు అర్ధంకాని విషయమే! 🙂