Search

Full Story

All that around you

Month

June 2014

పారిస్ లో డాక్టర్ గన్ని ప్రజెంటేషన్!


రాజమండ్రి –  జిఎస్ఎల్ మెడికల్ కాలేజిలో సర్జరీలపై పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఇస్తున్న సిములేటర్ శిక్షణ పై ఆకాలేజీ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గన్ని భాస్కరరావు పారిస్ లో జరుగిన ఒక కాన్ఫరెన్సులో 27 వతేదీ సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇఎఇఎస్(యూరోపియన్ అసోసియేషన్ ఆఫ్ ఎండోస్కోపిక్ సర్జన్స్)  పారిస్ లో 25 నుంచి 4 రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సులో యూరప్ నుంచి, భారతదేశంతో సహా ప్రపంచం నలుమూలల నుంచీ 2000 మంది సర్జన్లు పాల్గొన్నారు. 
భారతదేశంలో హెచ్చు  మాడ్యూల్స్ లో సిములేటర్ పై సర్జరీ శిక్షణ ఇస్తున్న వైద్యవిద్యాసంస్ధ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ యేనని డాక్టర్ గన్ని సదస్సులో వివరించారు. 
శరీరానికి కొతపెట్టి ప్రత్యక్షంగా చూస్తూ లేదా రంధ్రం చేసి సూక్ష్మ కెమేరాను లోనికి పంపి వీడియోలో చూస్తూ పాడైపోయిన, అనవసరమైన అంతర్భాగాలను రిపేరుచేసే 
సర్జరీల్లో నైపుణ్యాలు అనుభవాలను బట్టి పెరుగుతాయి. సీనియర్ సర్జన్ల పర్యవేక్షణలో జూనియర్లు సర్జరీలు చేస్తూ నిపుణులు అవుతారు.
ఎలకా్ట్రనిక్స్ ని సర్జరీ కి జోడించడంవల్ల నేరుగా పేషెంట్లమీదే అనుభవాలు పొందనవసరం లేకుండా సిములేటర్లు ఉపయోగపడుతాయి. కీహోల్/లాప్రోస్కోపిక్ సర్జరీలలో సర్జన్ కంటికి, చేతికి, మెదడుకి అవసరమైన సమన్వయాన్ని అనుభవపూర్వకంగా సిములేటర్ మీదపొందవచ్చు. 
వైద్యంలో, వైద్యవిద్యలో ఇలాంటి ఒకొక్క నీటిబొట్టూ చేరితే ఆంధ్రప్రదేశ్ నిండుతుంది

పివిగారితో చిన్నజ్ఞాపకం (ఇవాళ ఆయన జయంతి)


ఉదాత్తమైన వృత్తిని ఎంచుకున్నావు…మంచిదే!
భార్యాపిల్లలకు మంచి జీవితం ఇచ్చే ఆదాయాలు ఇందులో వున్నాయా? వేజ్ బోర్డులను అమలు చేసే వెసులుబాటు, బాధ్యత దిన పత్రికల యాజమాన్యాలకు వున్నాయా?? 
1985 లో కేంద్రమానవ వనరుల శాఖమంత్రి పివినరశింహారావుగారు నాతో అన్నమాటలు ఇవి. ఆయనా, ముఖ్యమంత్రి ఎన్ టి రామారావుగారూ హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో వచ్చి రేణిగుంట విమానాశ్రయంలో దిగారు..తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్ టి ఆర్ అభిమానులతో మహాకోలాహలంగా వుంది..అదంతా గమనిస్తూ పివి గారు వెయిటింగ్ రూమ్ కి చేరుకున్నారు. ఒక రెవిన్యూ అధికారి, ఒక పోలీసు అధికారి, ముగ్గురు పోలీసులు, ముగ్గురు రెవిన్యూ ఉద్యోగులు, పదిమందికంటే తక్కువమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పివి కోసం వేచివున్నారు.
కారు రెడీసర్ అని అధికారి చెప్పగానే వెల్దాంలే అన్నట్టు సైగ చేశారు(ఎన్ టి ఆర్ కాన్వాయ్ వెళ్ళిపోయాక బయలుదేరుదామన్నట్టు) కాఫీ అని ఆ అధికారి సంశయంగా అడిగినప్పుడు వద్దని సైగ చేశారు. పేపరు తిరగేయడం మొదలు పెట్టారు.
ఆసమయంలో నేను లోనికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. ఒకసారి తేరిపార చూసి ‘మంచిది’అన్నారు. పెద్దాడ రామచంద్రరావుగారు మాతండ్రిగారు అన్నాను. ఎక్కడ పెద్దాడ అని అడిగారు. వీరవాసరం చాలాకాలంగా జంగారెడ్డి గూడెం అని బదులివ్వగానే మొహంలో చిన్నమార్పు (బహుశ లోపల నవ్వి వుంటారు ఆయన మొహంలో సాధారణంగా నవ్వు పలకదు)
“మీ నాయన ఎలాగున్నాడు అతనిది మంచి ఆరోగ్యమే కన్ననూరు ఎర్రవాడ జైళ్ళలో కలసి వున్నాము రాజీపడని మనిషి యోధుడు సాహసి త్యాగం చేసినవాడు సంస్కరణ ఆలోచనలు బాగా చర్చించేవాడు. స్వాతంత్ర ఉద్యమానికి గాంధీ నిర్మాణకార్యక్రమాలకీ మీ నాయనది సమమైన ప్రాధాన్యత. ఇక్కడ తామ్రపత్రం అందుకున్న మొదటి 16 మందిలో నీ నాయన వున్నాడు” 
ఈ తరహాలో మానాన్నగారితో జ్ఞాపకాలను పివిగారు గుర్తుచేసుకున్నారు. ఆతరువాత నా వృత్తి ఉద్యోగ వివరాలు అడిగారు. 
ఉదాత్తమైన వృత్తిని ఎంచుకున్నావు…మంచిదే!
భార్యాపిల్లలకు మంచి జీవితం ఇచ్చే ఆదాయాలు ఇందులో వున్నాయా? వేజ్ బోర్డులను అమలు చేసే వెసులుబాటు, బాధ్యత దిన పత్రికల యాజమాన్యాలకు వున్నాయా?? అన్నారు!
తెలుగుదిన పత్రికలలో ఈనాడు బాగానే వుంటుంది.. నీకు ఇంగ్లీషు వచ్చునా ? ఇంగ్లీషు పేపర్లలో జీతభత్యాలు కొంత మెరుగు అని కూడా అన్నారు.
ఇంకేమీ మాట్లాడలేదు పేపర్ చదువుకుంటూ వుండిపోయారు. ఏడెనిమిది నిమిషాల తరువాత తలపైకెత్తి అటూ ఇటూ చూస్తూండగా అధికారి రెడీసర్ అన్నారు. ఆయన సోఫానుంచి లేచి రెండడుగుల వేశారు 
నమస్కారం వుంటాను సార్ అన్నాను 
నావైపు తలతిప్పి “మంచిది” అంటూ వెళ్ళిపోయారు 

80 ఏళ్ళ వృద్ధులకు ఓపెన్ హార్ట్ సర్జరీ


అధునాతన సాంకేతిక విజ్ఞానం, వైద్య పరీక్షలు, చికిత్సా విధానాల్లో తాజా పరిశోధనలు, పరిశీలనలపై నిరంతర అవగాహన, రాజీలేని మౌలికవసతులకు వైద్యుల నైపుణ్యం, సారధ్యం, అనుభవాలు తోడైతే  ఆపరేషన్ నుంచి “రిస్క్” అనే మాట దూరమౌతుంది..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పక్కనేవున్న రాజానగరం దగ్గర వున్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్లో జరుగుతున్నది ఇదే..ఈ హాస్పిటల్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం…కొద్దినెలలక్రితం 11 రోజులపాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేసింది.
ఇపుడు తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామస్ధుడైన డభ్భైఎనిమిదేళ్ళ సఫరు వెంకట గోపాలరావు సరిగా ఊపిరందని సమస్యతో ఈ ఆస్పత్రిలో చేరారు..ఆయన గుండె కవాటాల్లో ఒకటి (వాల్వ్ – అయోటిక్ – Aortic) మూసుకుపోయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా దాన్ని సరిదిద్దవలసి వుంది. ఆయితే వయసుపైబడిన కారణంగా ఈ ఆపరేషన్ వల్ల లంగ్ ఇన్ ఫెక్షన్, బ్రెయిన్ లో సమస్యలు, కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది…అవేమీ రాకుండా గోపాలరావుకి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ టి రాజేంద్రప్రసాద్ 15 రోజులక్రితం విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు.. అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ విజయ లక్షి్మ, ఇంటో్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ జెనా సహకరించారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అలమండ రామారావు 80 ఏళ్ళ వయసులో దగ్గు, ఛాతినొప్పితో ఆస్పత్రికి వచ్చారు. పరీక్షల్లో ఆయన లంగ్స్ లో కేన్సర్ కణిత వున్నట్టు బయట పడింది..రెండురోజులక్రితం సర్జరీద్వారా దాన్ని తొలగించారు.
అన్ని సదుపాయాలతో పాటు కలిసికట్టుగా పనిచేయగల టీమ్ వర్క్ వల్లే “రిస్క్” కేసులను విజయవంతంగా నయం చేయగలుగుతున్నామని డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరించారు.
జీవించి వున్నంతవరకూ ఏ ఆరోగ్య సమస్యా లేకుండా క్వాలిటీ లైఫ్ కొనసాగింపచేయడమే – ఎంత పెద్ద వయసువారికైనా సర్జరీలు చేయడంలో వున్న ఆలోచన అనీ, వనరులు వసతుల కారణంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ లో అవేమీ రిస్కీ ఆపరేషన్లు కావని,  ఇప్పటికే రుజువైందనీ ఆయన వివరించారు.
రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపధ్యంలో ఉన్నత స్ధాయివైద్యచికిత్సలకోసం హైదరాబాద్ మాత్రమే వెళ్ళవలసిన అనసరం లేదనడానికి ఇలాంటి కేసులు ఉదాహరణ అని జిఎస్ ఎల్ విద్యాసంస్ధల మెంటార్, సర్జరీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ గన్ని భాస్కరరరావు వ్యాఖ్యానించారు.. విశాఖపట్టణం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మొదలైన పట్టణాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో వైద్య, వైద్య విద్యావసతులు బాగున్నాయని వీటన్నిటినీ ఆధునీకరించకుని వైద్యులు వైద్యరంగం అప్ డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వంద కిలోమీటర్ల దూరంలో స్పెషాలిటీలతో సహా ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటు కాగలవనీ వివరించారు. 
ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని హృద్రోగం నుంచి కాపాడుకోడానికి ఐదుదశాబ్దాలక్రితం భారతదేశంలోనే అందుబాటులో లేని వైద్య సదుపాయాలు డాక్టర్ల నైపుణ్యం
ఇపుడు రాజానగరం లాంటి చిన్న గ్రామంలోకూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ ద్వారా లభించడం విశేషమని డాక్టర్ గన్ని భాస్కరరావు వ్యాఖ్యానించారు.

గోదావరి పుష్కరాల ఏరోజునుంచి ? (ప్రవాసాంధ్రులకు ప్లానింగ్ కోసం ఇప్పుడే తెలియాలి)


ప్రతీ 12 ఏళ్ళకూ గురుడు సింహరాశిలో ప్రవేశించిన రోజుమొదలు 12 రోజులు గోదావరి పుష్కరాలు జరగుతాయి. ఈ ప్రకారం 2015 జులై రెండో వారంలో పుష్కరాలు మొదలవ్వాలి.   
దేవాదాయ ధర్మాదాయ శాఖ పండితుల సభను నిర్వహిస్తుంది. ఆసిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వం తేదీలు నోటిఫై చేస్తుంది. 
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పనిచేయడం లేదు కనుక ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు.
జ్యోతిష్కుల్లో భిన్నాభిప్రాయాలు : గ్రహాలు రాశుల సంచారాన్ని బట్టి పండుగలు తేదీలను నిర్ణయించే గణన విధానాలు దేశంలోపదకొండు వున్నయి. 
దక్షిణాది రాషా్ట్రల్లో ప్రధానంగా సూర్యమానాన్ని అనుసరిస్తారు. ఈ విధానంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని పిడపర్తి కుటుంబీకులు, పశ్చిమగోదావరి జిల్లా రేలంగిలోని తంగిరాల కుటుంబీకుల లెక్కలకు దక్షిణ భారతంలోనే విశేషమైన గుర్తింపు వుంది. “పిడపర్తి వారి పంచాంగం”, “తంగిరాల వారి పంచాంగం” పేరుతో ఆ కుటుంబాలు బ్రాండ్లు అయ్యాయి. అయితే అవే కుటుంబాల్లో వారసులు పరంపరగా ఆ వృత్తిని కొనసాగించక పోవడం, కొనసాగించినా మార్కెటింగ్ నైపుణ్యాలు లేకపోవడంతో ఆ బ్రాండ్లు కూడా చిక్కిపోతున్నాయి. 
రాజమండ్రికే చెందిన బుట్టే దైవజ్ఞ సిద్ధాంతి ఇపుడు చాలా పాపులర్ గణకుడు. పేరుమార్పేతప్ప ఇదంతా పిడపర్తి వారి విధానమే నని ఈయన ప్రత్యర్ధులు అంటూంటారు.
నాలుగైదేళ్ళుగా స్వామీజీలు, పీఠాల అధిపతులు, సర్వసంగ పరిత్యాగులూ కూడా జ్యోతిషాంశాలలో వేళ్ళూ కాళ్ళూ పెట్టేసి తేదీలనుప్రకటించేస్తున్నారు. అందువల్ల వారికీ వారి మఠాలకీ టివిల్లో మంచి ప్రాచుర్యం, ప్రజలమైన మనకు గొప్ప గందరగోళం తప్పడం లేదు. ఫలితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని పండిత సభలో అభిప్రాయం ప్రకారం వేడుకలు/క్రతువుల తేదీని సమయాన్ని ఖరారు చేయవలసి వస్తోంది. ఈ ఖరారులో మార్కెటింగ్, బ్రాండింగ్, లౌక్యాలు లాబీయింగ్ లు తెలిసిన వారి వాదనలదే పైచేయి అవుతోంది. ఇందులో వెనుక బడిన వారికి న్యూస్ టివిలు అదేపనిగా వేదికలౌతున్నాయి.
ఇందువల్లే మూడునాలుగేళ్ళుగా ప్రతీ – పండుగ “వేళా” వివాదాలౌతున్నాయి.
మధిర వారి దృక్ సిద్ధాంతం :  ఈసందర్భంగా అత్యంత ప్రాచీనమైన దృక్ సిద్ధాంతాన్నికి ఆధునికతను ఆపాదించి దేశవ్యాప్తంగా ఒకే కేలెండర్ తీసుకురావడానికి ప్రయత్నించిన రాజమండ్రి పెద్దమనిషి మధిర కృష్ణమూర్తి శాస్త్రి గారిని ప్రస్తావించుకోవాలి. ఆయన వయోభారం, అనారోగ్యాలతో కొద్దినెలలు గా బయటికి రావడం లేదు. 
అన్ని జ్యోతిష సిద్ధాంతాలనూ సమన్వయం చేసి ఒకే గణన విధానాన్ని అమలు చేయడానికి ఈయన అన్ని రాషా్ట్రలూ తిరిగారు. ఉత్తరాది రాషా్ట్రల్లో ఈయన ప్రతిపాదనకు గట్టి మద్దతు లభించింది. స్వస్ధలంలో, జ్యోతిష పండితుల్లో ఆయన కు ఎనలేని గౌరవమర్యాదలున్నాయి. ఆయన సిద్ధాంతాలకు ప్రతిపాదనలకు మాత్రం మన్ననలేదు. ఏడెనిదేళ్ళ క్రితం నేను మధిర కృష్ణమూర్తి శాస్తిగారితో  ఈ సంగతే ప్రస్తావించినపుడు
“నా జాతకమే అంత” అని పెద్దగా నవ్వేశారు.
ప్రపంచంతో పెరిగిన కనెక్టివిటీ వల్ల గోదావరి పుష్కరాలకు దేశదేశాల్లోవున్న తెలుగువారు, భారతీయులు గోదావరి పుష్కరాలకు వస్తారు..తేదీలు ఖరారైతే తప్ప వారు టూర్ ప్లాన్ చేసుకునే అవకాశం లేదు. సెలవులు, టికెట్లు, పుష్కరాలతోపాటు చూడవలసిన ఇతర ప్రాంతాలు, తిరుగు ప్రయాణం షెడ్యూల్ పుష్కరాలతేదిల నోటిఫికేషన్ తోనే ముడిపడివుంది. ఇందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతల్లో తేదీలనోటిఫికేషన్ కూడా ముఖ్యమైనదే – పెద్దాడ నవీన్ 

ఎడమొహం పెడమొహం అసలు కథ


తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారానికి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కాబోతున్న నారా చంద్రబాబునాయుడిని ఆహ్వనించలేదు. అలాగే బాబు తన ప్రమాణస్వీకారానికి ఫోన్ లో స్వయంగా ఆహ్వనించినా, ఎమ్మెల బృందంతో ప్రత్యేకంగా ఆహ్వానం పంపినా కెసిఆర్ ఆకార్యక్రమానికి హాజరుకాబోవడం లేదు…నా అంచనా ప్రకారం తమప్రభుత్వ ప్రతినిధిగా ఎవరో ఒక మంత్రిని కూడా ఈ కార్యక్రమానికి పంపకపోవచ్చు
దీనిఅర్ధం చంద్రబాబు, కెసిఆర్ లమధ్య విబేధాలు వ్యక్తిగత స్ధాయికి పెరిగిపోయాయని అనుకోనవసరంలేదు. 
అంతవున్నత స్ధానాల్లో వున్నవారికి (సినిమాల్లో తప్ప)నిజజీవితంలో వ్యక్తిగత విరోధాలు వుండే అవకాశం వుండదు…
అటెండర్ లేకపోవడంవల్లే చంద్రబాబుకి పంపలేకపోయానని ఎమ్మెల్యేల బృందం వద్ద కెసిఆర్ వ్యాఖా్యనించడంలో ఆయన వ్యంగ్య పూరిత సమయాస్పూర్తి కంటే తాను ఆంధ్రోళ్ళని సహించలేను అన్న సంకేతం తెలంగణా ప్రజలకు పంపడమే ప్రధానంగా కనిపిస్తోంది.
విభజనైతే జరిగిపోయింది. అనంతర కష్టాలు, సమస్యలు ఆంధ్రప్రదేశ్ లో కళ్ళముందు కనిపిస్తున్నాయి. తెలంగాణాకు వుండే సమస్యలు కూడా తక్కువేమీకాదు. 
విభజన విజయం టిఆర్ ఎస్ కిమాత్రమే దఖలు పడాలని ఐక్యకార్యాచరణ సమితిని కూడా దూరంగా వుంచడానికి కోదండరామ్ ని కూడా దూరంగా వుంచిన వ్యూహకర్త కెసిఆర్
విభజనవరకూ మౌనంగా వున్న కెసిఆర్ ఆతరువాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక పాకేజి అంటే సహిండంలేదు..పోలవరం ప్రాజెక్టుకు ముందు అంగీకరించి లేదా మౌనం పాటించి ఇపుడు ఆర్డినెన్సు ను వ్యతిరేకించడం కూడా విజయోత్సాహంతో వున్న  ప్రజల్లో తెలంగాణా సెంటుమెంటు ఆరిపోకుండా చూడటానికే…కేంద్రంనుంచి అదనపు రాయితీల సాధనలో ఇది ఆయనకు ముఖ్యం…సాధించలేకపోతే దుమ్మెత్తి పోయడానికి చంద్రబాబుని ఇప్పటికే ఒక టార్గెట్ గా కెసిఆర్ తెలంగాణా ముందుంచారు…ఆంధ్రోళ్ళని ఆడిపోసుకోవడం తెలంగాణా వాళ్ళకి సంతోషమన్న వాతావరణాన్ని సృష్టించింది కేసిఆర్ …దాన్ని వచ్చే ఐదేళ్ళూ వాడుకోబోతున్నదీ ఆయనే 
ఇందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కెసిఆర్ నుంచి ఎలాంటి గుడ్ విల్ గెశ్చర్ ని ఆశించినా అది అడియాసే అవుతుంది.
చంద్రబాబు ఆయితే తానను అందరూ ఆమోదించాలని భావిస్తారు. ఆదిశగాగానే ఆయన ప్రతి అడుగూవుంటుంది. ఆనడకలో ఆరడుగులకు మించిన తనను తాను కుంచింపచేసుకోవడం బాబు స్వభావం. ఎవరేమనుకున్నా లెఖ్ఖపెట్టకుండా లక్ష్యాలు సాధించుకోవడానికే కఠినంగా వుండటం బక్కచిక్కిన కెసిఆర్ అసలురూపం 
 
వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సామాన్యులకు అవసరంలేదు..విజయసారధులను ప్రజలు భుజాలమీద ఎక్కించుకుని ఊరేగిస్తారు.. వారిలో ధీరులై ధిక్కరించి గెలిచిన వారిని ఊరేగించేటపుడు ఉత్సాహపు చిందులు కూడా వేస్తారు.

….కనీసమర్యాదకూడా తెలియదా!


విభజన తప్పంతా కాంగ్రెస్ మీద పడటమే ఓటమి కారణం: ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి 
1) తప్పుజరిగిందని ఒప్పుకున్నందుకు సంతోషం 
2) లాభం సొంతానికి నష్టం ఎదుటిపార్టీలకూ తోసేయ్యాలన్న వెధవ అవును వెధవ అలోచనలతోనే పీకమీద కత్తి పెట్టినట్టు ఉత్తరాలు తీసుకుని ఆడిన డా్రమా చిన్న పిల్లలకి కూడా తెలిసిపోయాక,  మీ పార్టీని ప్రజలు ఈడ్చి ఈడ్చి తన్నాక కూడా బుద్ధి తెచ్చుకోరా మీరు ? 
ఇంకా నెపం ఎదుటి వాళ్ళ మీద తోసేసే కుట్ర ఆలోచనలేనా ? థూ…
3) సరే అయిందేదో అయ్యింది…మీరు తీసుకున్న నిర్ణయానికి మీరే కట్టుబడి వుండలేరా? విభజనే ఓటమికి మూలమని  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడ్డాక అనవచ్చునా?
4) కాంగ్రెస్ నాయకులకు బుద్ధీ జ్ఞానాలు ఎలాగూ లేవు..ఇంగిత జ్ఞానం కనీస మర్యాదా కూడా లేవా 
ఒక మూడునెలలైనా టివిల్లోకి పత్రికల్లోకి రాకండయ్యా 
చికాకుగా వుంటుంది 

Blog at WordPress.com.

Up ↑