అధునాతన సాంకేతిక విజ్ఞానం, వైద్య పరీక్షలు, చికిత్సా విధానాల్లో తాజా పరిశోధనలు, పరిశీలనలపై నిరంతర అవగాహన, రాజీలేని మౌలికవసతులకు వైద్యుల నైపుణ్యం, సారధ్యం, అనుభవాలు తోడైతే  ఆపరేషన్ నుంచి “రిస్క్” అనే మాట దూరమౌతుంది..
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పక్కనేవున్న రాజానగరం దగ్గర వున్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్లో జరుగుతున్నది ఇదే..ఈ హాస్పిటల్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం…కొద్దినెలలక్రితం 11 రోజులపాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తిచేసింది.
ఇపుడు తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామస్ధుడైన డభ్భైఎనిమిదేళ్ళ సఫరు వెంకట గోపాలరావు సరిగా ఊపిరందని సమస్యతో ఈ ఆస్పత్రిలో చేరారు..ఆయన గుండె కవాటాల్లో ఒకటి (వాల్వ్ – అయోటిక్ – Aortic) మూసుకుపోయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా దాన్ని సరిదిద్దవలసి వుంది. ఆయితే వయసుపైబడిన కారణంగా ఈ ఆపరేషన్ వల్ల లంగ్ ఇన్ ఫెక్షన్, బ్రెయిన్ లో సమస్యలు, కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది…అవేమీ రాకుండా గోపాలరావుకి కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ టి రాజేంద్రప్రసాద్ 15 రోజులక్రితం విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు.. అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ విజయ లక్షి్మ, ఇంటో్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనుపమ్ జెనా సహకరించారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన అలమండ రామారావు 80 ఏళ్ళ వయసులో దగ్గు, ఛాతినొప్పితో ఆస్పత్రికి వచ్చారు. పరీక్షల్లో ఆయన లంగ్స్ లో కేన్సర్ కణిత వున్నట్టు బయట పడింది..రెండురోజులక్రితం సర్జరీద్వారా దాన్ని తొలగించారు.
అన్ని సదుపాయాలతో పాటు కలిసికట్టుగా పనిచేయగల టీమ్ వర్క్ వల్లే “రిస్క్” కేసులను విజయవంతంగా నయం చేయగలుగుతున్నామని డాక్టర్ రాజేంద్రప్రసాద్ వివరించారు.
జీవించి వున్నంతవరకూ ఏ ఆరోగ్య సమస్యా లేకుండా క్వాలిటీ లైఫ్ కొనసాగింపచేయడమే – ఎంత పెద్ద వయసువారికైనా సర్జరీలు చేయడంలో వున్న ఆలోచన అనీ, వనరులు వసతుల కారణంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ లో అవేమీ రిస్కీ ఆపరేషన్లు కావని,  ఇప్పటికే రుజువైందనీ ఆయన వివరించారు.
రాష్ట్రం రెండుగా విడిపోయిన నేపధ్యంలో ఉన్నత స్ధాయివైద్యచికిత్సలకోసం హైదరాబాద్ మాత్రమే వెళ్ళవలసిన అనసరం లేదనడానికి ఇలాంటి కేసులు ఉదాహరణ అని జిఎస్ ఎల్ విద్యాసంస్ధల మెంటార్, సర్జరీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ గన్ని భాస్కరరరావు వ్యాఖ్యానించారు.. విశాఖపట్టణం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మొదలైన పట్టణాల్లో ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో వైద్య, వైద్య విద్యావసతులు బాగున్నాయని వీటన్నిటినీ ఆధునీకరించకుని వైద్యులు వైద్యరంగం అప్ డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి వంద కిలోమీటర్ల దూరంలో స్పెషాలిటీలతో సహా ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటు కాగలవనీ వివరించారు. 
ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని హృద్రోగం నుంచి కాపాడుకోడానికి ఐదుదశాబ్దాలక్రితం భారతదేశంలోనే అందుబాటులో లేని వైద్య సదుపాయాలు డాక్టర్ల నైపుణ్యం
ఇపుడు రాజానగరం లాంటి చిన్న గ్రామంలోకూడా జిఎస్ఎల్ మెడికల్ కాలేజి టీచింగ్ హాస్పిటల్ ద్వారా లభించడం విశేషమని డాక్టర్ గన్ని భాస్కరరావు వ్యాఖ్యానించారు.