ఒకే వ్యక్తకి ఒకే డాక్టర్ 34 ఏళ్ళ వ్యవధిలో మూడుసార్లు విజయవంతంగా గుండె ఆపరేషన్ చేసిన ఉదంతం ఇది… డాక్టర్ అనుభవ నైపుణ్య సామరా్ధ్యలు, రోగి కంటిన్యువస్ ఫాలో అప్ సమన్వయంగా సాగితే హైరిస్క్ కేసుల్లో కూడా రోగి లైఫ్ క్వాలిటీని సురక్షితంగా పెంచవచ్చు అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ.

రాజమండ్రి ప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ భార్య శ్రీమతి రాజేశ్వరి కి హృద్రోగ సమస్య తలెత్తినపుడు 1980 లో మద్రాసులో డాక్టర్ చెరియన్ మొదటిసారి ఆమె ఎడమ వాల్వ్ ను సర్జరీలో రిపేరు చేశారు. తరువాత అసౌకర్యంగా వుండటంతో 1987 లో దాన్ని తొలగించి అదే డాక్డర్ సింధటిక్ (Mitral) వాల్వ్ అమర్చారు. ఇపుటు తాజాగా కొత్త కుడివాల్వు కూడా అమర్చారు.

27 ఈళ్ళ తరువాత కొంతకాలంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వల్ల తిరిగి పరీక్షలు చేయించగా ఈ సారి కుడివాల్వు లో సమస్య ఏర్పడినట్టు గుర్తించారు.

కుడివాల్వ్ కావడంతో రిస్కు ఎక్కువనీ, ఇప్పటికే రెండు సార్లు గుండె ఆపరేషన్ జరిగివున్న నేపధ్యం వల్ల ఇది మరీ ఎక్కువనీ, మందులతో చికిత్స కొనసాగిస్తే బెటరనీ డాక్టర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఇప్పటికే రాజేశ్వరికి రెండుసార్లు సర్జరీ చేసిన డబ్బై ఐదేళ్ళ డాక్డర్ చెరియన్ ఇప్పటికీ ఆపరేషన్లు చేస్తున్నారని తెలుసుకున్న కుటుంబీకులు ఆయన్ని సంప్రదించారు. గన్ని కృష్ణ తమ్ముడు జిఎస్ ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు పలుధఫాలు డాక్టర్ చెరియన్ తో సంప్రదించారు. చెన్నయ్ తీసుకువెళ్ళి పరీక్షలు చేయించారు. పాతరికార్డులను రాజేశ్వరి ఇప్పటికీ భద్రపరచి వుంచడం విశేషమని డాక్టర్ చెరియన్ ప్రశంసించారు.

శ్రీమతి రాజేశ్వరికి జనవరి 28న చెన్నయ్ లోని ఫ్రాంటియర్ లైన్ హాస్పిటల్స్ లో డాక్టర్ చెరియన్ సర్జరీ దెబ్బతిన్న కుడివాల్వు (Tricuspid) స్ధానంలో కొత్తదాన్ని అమర్చారు. ఆమె కోలుకుంటున్నారు.

‘ ఏ కేసులో అయినా లైఫ్ ఎంతముఖ్యమో, క్వాలిటీ లైఫ్ కూడా అంతే ముఖ్యం.ఆపరేషన్ చేయకుండా తలెత్తే సమస్యల రిస్క్ కీ , ఆపరేషన్ లో వున్న రిస్క్ కీ ప్రయోజనాలనూ నష్టాలనూ బేరీజు వేసే ఏది ఎక్కువ ఉపయోగం అన్నదాన్నిబట్టే నిర్ణయం తీసుకుంటామని ‘ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు సర్జరీ చేసిన డాక్టర్ చెరియన్ ఇంకా యాక్టివ్ గా వుండటం పేషెంటు వద్ద రికార్డులు భద్రంగా వుండటం అరుదైన విశేషమని కూడావివరించారు

ఫొటోలో డాక్టర్ చెరియన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గన్ని కృష్ణ , ఎడమవేపు కృష్ణ కుమార్తె శ్రీమతి స్మిత కుడిచివర డాక్టర్ గన్ని భాస్కరరావు.

2015/01/img_1720.jpg