Search

Full Story

All that around you

Month

March 2015

బడ్జెట్ అంటే…విసిగించే అంకెల మాయకార్పొరేట్లపై దయగా వుండటానికి ప్రజలపై నిర్దయ(శనివారం నవీనమ్) 


ప్రజలందరి గౌరవప్రదమైన మనుగడకు, సామాజికంగా ఆర్ధికంగా మెరుగైన జీవనానికి దోహదపడేలా సహజవనరుల్ని, మానవవనరుల్ని వినియోగించుకునే బడ్జెట్టు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల సాముదాయిక సంపదను అతికొద్దిమందికి మళ్ళించడమే ప్రభుత్వాల పనైపోయింది. రైతు ఇష్టంతో పనిలేకుండానే వారిభూములు స్వాధీనం చేసుకునే ఆర్డినెన్స్ తో బిజెపి ప్రాధాన్యత ఏమిటో దేశానికి అర్ధమైపోయాక కేంద్ర బడ్జెట్ మీద ఆసక్తి ఏముంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి లాండ్ పూలింగ్ విధానం వినడానికి బాగున్నా దాన్ని చట్టబద్దం చేయనపుడు తెలుగుదేశాన్ని నమ్మడమెలాగ? విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి అని వెన్నపూత పూసిన బిజెపి అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే అదేమీ కుదరదు అన్నట్టే ల్యాండ్ పూలింగ్ హమీలను తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృష్ణానదిలో పాతిపెట్టవన్న నమ్మకం ఏమిటి???

బతకగలిగిన వాడే బతుకుతాడు, లేనివాడు అణగారి నశిస్తాడు…అనేది జీవపరిణామంలో నిజమే…మనుషుల విషయంలో ఇది అమానుషం…కొన ఊపిరితో వుండేవారికి నాలుగు మెతుకులు విదిలించి దేశసంపదను కొందరికే కట్టబెట్టే సరళీకృత వ్యవస్ధలో ఉదారవిధానాలంటే కఠినాతి కఠినమైన విధానాలే…అందుకే కొన్నేళ్ళుగా దేశవ్యాప్తంగా బడ్జెట్టులన్నీ కఠినంగానే వుంటున్నాయి.

కాకుల్ని కొట్టి గ్రద్దలకు వేయడమే, కార్పొరేట్లపై దయగా వుండటానికి ప్రజలపై నిర్దయగా వుండటమే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం విధానాలని ముందుగానే బయటపడిపోయాక, ఇక ఆ ప్రభుత్వాల బడ్జెట్టుల మీద ఆశా, ఆసక్తీ లేకుండా పోయాయి. హృదయం లేని బడ్జెట్ అంకెల్లో పారదర్శకత కూడా లేకపోవడం మరో విషాదం.

ఒకపక్క లక్షా 13 వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ పరుస్తూ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకుగానీ, అధికారంలోకొచ్చాక కురిపించిన వరాలకుగానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2015-16 ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చోటివ్వలేకపోయారు.

అదనపు పన్నుల భారాన్ని మోపడం లేదంటూనే…వచ్చే ఏడాదిలో పన్నుల ద్వారా అదనంగా రూ. 7,000 కోట్లు వస్తుందని యనమల అంచనావేస్తున్నారు. ఈ అదనపు ఆదాయాన్ని రాబట్టడానికి ‘ఇతర మార్గాలు అన్వేషిస్తామ’నడం తప్ప ఏం చేయదల్చుకున్నదీ ఆయన చెప్పలేదు. పన్నుల రూపంలో మొత్తం రూ. 44,432 కోట్లు వస్తుందంటూనే వ్యాట్ పద్దులో రూ. 4,000 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ద్వారా రూ. 1,000 కోట్లు, యూజర్ చార్జీల ద్వారా రూ. 500 కోట్లు అదనంగా రాగలవని మాత్రం ఆయన చూపారు. ఈ చూపిన మొత్తాలతో కలుపుకుని పన్నులు, చార్జీల ద్వారా మొత్తం రూ. 7,000 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆశిస్తూనే కొత్త పన్నులు ఉండబోవని చెప్పడం వంచన తప్ప మరేమీ కాదు.

నిరుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌కూ, ఇప్పటికీ చంద్రబాబు సర్కారు సాధించిన పురోగతి ఏమైనా ఉంటే అది జనం తలసరి అప్పును అమాంతం పెంచడమే! ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి అప్పులు రూ. 1,29,264 కోట్లుంటే…వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 17,588 కోట్లు అప్పుతీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ అప్పులనైనా ఆస్తుల కల్పనకు ఖర్చుచేసి ఉంటే ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉండేది. కానీ, ఎక్కువ భాగాన్ని రెవెన్యూ వ్యయానికే ఉపయోగిస్తున్నారు. పర్యవసానంగా పెరిగేవి అప్పులే. వాటిపై కట్టాల్సిన వడ్డీలే. కనుక ఈసారి ద్రవ్యలోటు రూ. 17,584 కోట్లుగా అంచనావేసినా చివరకు అది అంతకన్నా ఎక్కువగా పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పులు చేయడంపై విధించిన 14వ ఆర్థిక సంఘం పరిమితులను కూడా మించిపోవడమంటే వ్యయంపై ప్రభుత్వానికి అదుపు లేకపోవడమే.

రైతుల రుణమాఫీ విషయంలో ఏదో అమలు చేస్తున్నామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం…డ్వాక్రా రుణాల విషయంలో ఆ మాత్రం కూడా మాట్లాడటం లేదు. ఆ ఊసెత్తకుండా దాని స్థానంలో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటుచేయబోతున్నట్టు ప్రకటించింది. అసలు డ్వాక్రా రుణమాఫీ విషయంలో నియమించిన కమిటీ నివేదిక ఏమైందన్నది కూడా చెప్పలేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చేనేత రుణమాఫీ కూడా డిటోయే. చేనేత రుణమాఫీకి రూ. 168 కోట్లు అవసరమని అంచనా వేస్తే అందుకోసం కేటాయించిన మొత్తం అత్యంత స్వల్పం. ఇక చేనేత కార్మికులకు రూ. 1,000 కోట్లతో నిధి హామీ ఎటుపోయిందో తెలియదు.

ఇవి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల దుస్థితి. అధికారానికొచ్చాక ఇచ్చిన హామీల పరిస్థితి కూడా అంతంతమాత్రమేనని బడ్జెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసమని భూ సమీకరణ కింద రైతులనుంచి ‘స్వచ్ఛందంగా’ 33,000 ఎకరాలు తీసుకున్నామని ప్రకటించినా వారికివ్వాల్సిన నష్టపరిహారం కోసం చేసిన కేటాయింపు రూ. 60 కోట్లు మాత్రమే! ఒకపక్క అంతర్జాతీయ శ్రేణి రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటనలిస్తూ అందుకోసం కేటాయించింది రూ. 303 కోట్లు! తమ నిర్వాకమే ఇలావుంటే రాజధాని నిర్మాణానికి కేంద్రాన్ని అడగడం, సాధించడం సాధ్యమవుతుందా?!

వర్షాభావ పరిస్థితులనూ, హుద్‌హుద్ తుపానువంటి విలయాన్ని ఎదుర్కొని కూడా 5.9 శాతం వృద్ధిని నమోదుచేసిన వ్యవసాయరంగంపై ప్రభుత్వం శీతకన్నేసింది. శుక్రవారం రూ. 14,184 కోట్లతో ప్రవేశపెట్టిన వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌లో అధిక భాగం ప్రణాళికేతర వ్యయమే ఉంది. అదంతా జీతాలు, ఇతర ఖర్చులకు సరిపోతుంది. ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, ఉపాధి హామీ తదితరాలుండే ప్రణాళికా వ్యయానికి కేటాయింపులు తక్కువున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు చంద్రబాబు ధరల స్థిరీకరణ కోసమే ప్రత్యేకంగా రూ. 5,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ హామీ కాస్తా అటకెక్కిందని ఈ ప్రత్యేక బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఉచిత విద్యుత్‌కు రూ. 6,455 కోట్లు అవసరమని విద్యుత్ పంపిణీ సంస్థలు కోరితే అందుకోసం ప్రభుత్వం కేటాయించింది రూ. 3,000 కోట్లు. కనుక ఉచిత విద్యుత్‌కు కోతపడుతుందన్నమాటే!

అంకెల మాయాజాలం వేలకోట్లనుంచి ఊహ కందనంతగా లక్షకోట్లకు పెరిగిపోవడం వల్ల సామాన్యులకు బడ్జెట్ మీద ఆసక్తి అంతరించి బడ్జెట్ మీద విసుగూ అసహనాలూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలకు కావలసింది కూడా ఇదేనేమో!!!

జనబలం వున్నా సహనం నిబ్బరంలేని జగన్ 


లేచి నిలబడితే చాలు ”లక్షకోట్ల అవినీతీ ఇక కూర్చో” అనే హేళన…శాసనసభలో జగన్ అవస్ధ దయనీయంగా వుంది. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నపుడు ఆయన్ని వై ఎస్ రాజశేఖరరెడ్డి సభలో ఇంతే దారుణంగా అవమానించేవారు…దెబ్బకు దెబ్బ అని చప్పట్లు కొట్టుకోడానికి ఇది ఉద్వేగభరితమైన సినిమా సన్నివేశం కాదు. పరిహాసం పాలైన / పాలౌతున్న సభామర్యాద.

అరవైఏడుమంది సభ్యులు అంటే జగన్‌పార్టీకి అది గౌరవప్రదమైన బలమే. అయినా ఆ పార్టీ పరిస్థితి కాంగ్రెస్‌కంటె ఏ మాత్రం మెరుగ్గా లేదు. జగన్‌ మూటగట్టుకున్న అప్రతిష్ఠ ఆ పార్టీకి పెద్ద గుదిబండగా మారింది. అంతేకాకుండా శాసనసభలో జగన్ వ్యవహారశైలి ప్రజాప్రయోజనాల మీద దృష్టిగా కాక చంద్రబాబుని సహించేదిలేదన్న ఉడుకుమోతుతనంగానే వుంది. అధికారంలోకి రావడానికి సహనం అవసరమన్న కనీస సూత్రాన్ని కూడా ఆయన పట్టించుకోరని స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడానికి ఏమి చేయాలో ఆయనకు అంతు బట్టడం లేదు. తనకు గణనీయమైన ఓట్లను ఇచ్చిన ప్రజలలో విశ్వాసం కలిగించడానికి, ఇవాళ కాకపోతే రేపైనా విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కార్యకర్తల్లో కలిగించడానికి నాయకుడికి ఎంతో నిబ్బరమూ ముందుచూపూ ఉండాలి. రాజశేఖరరెడ్డి స్మృతి మీద ఆధారపడి నెగ్గుకువచ్చిన జగన్‌కు మున్ముందు ఆ ఆసరా ఉండదు.  జ్ఞాపకాన్ని సుదీర్ఘకాలం కొనసాగించడం కష్టం. ఆయన సొంత వ్యక్తిత్వం మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జగన్‌కు ఉన్న అవినీతి ముద్ర ఆయనకు తీవ్రమయిన ప్రతిబంధకం కాకపోవచ్చు. అవినీతి పరురాలని నిర్ధారణ అయినా కూడా జయలలితకు ఆదరణ ఏమీ తగ్గలేదు.

2002 హింసాకాండ తరువాత నరేంద్రమోదీ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా ఎంతగా దిగజారిందో తెలిసిందే. దాన్నుంచి ఆయన తేరుకోవడమే కాదు, దాని నుంచి కూడా లబ్ధిపొంది, అభివృద్ధి వాది అన్న సానుకూల ముద్రను కూడా తోడు చేసుకుని ఆయన ఇవాళ ప్రధానమంత్రి కాగలిగాడు. సరి అయిన వ్యూహమూ, సహనమూ ఉంటే జగన్‌ తన ప్రతికూల ముద్రను కూడా అధిగమించవచ్చు. అయితే ఆయన స్వభావం ఇందుకు సహకరిస్తుందా ??? అనుమానమే!!!

ఇండియాస్ డాటర్!


ఇది మూర్ఖీభవించిన మగ అహంకారమే కాదు. సీ్త్ర శరీరం మీద దాడే కాదు. మగువకు అవమానం మాత్రమే కాదు.

దేశమంతా కౌరవసభగా విస్తరిస్తూండటంలో ఒక కొత్త లక్ష్మణ రేఖా కనిపిస్తోంది…సాధికారికతకు ఎదుగుతున్న మహిళను సహించని పెత్తందారీ హెచ్చరికా వుంది. 

హెచ్చరికను ధిక్కరించడంలోనే, రేఖను అధిగమించడంలోనే మహిళలకు భద్రత వుంటుంది…వారి ధిక్కారం, స్వేచ్ఛ, ఆత్మాభిమానం సామూహిక సంకల్పంగా మారాలి…అన్ని రంగాలూ సీ్త్రకరించబడేలా ప్రజాస్వమీకరణ జరగడంలోనే మహిళ పురోగమనం వుందని గమనించాలి.

ఇది అన్యాయం మీద తిరగబడటం కాదు. మనుగడ కు సంబంధించిన పోరాటం కావాలి.

ఇందుకు, ఆడపిల్లల ఆక్రందనకు స్పందించే సున్నితత్వాన్ని మగజనం, మన యువజనం అలవరచుకుంటే చాలు!

రాజధాని నిర్మాణంలో సామాజిక అంశాలను పక్కనపడేశారు 


“సింగపూర్‌లోని సమాజం వ్యవస్థితమైనది, పారిశుధ్యం, విద్య, శాంతిభద్రతలు, సాంకేతికత, నూతన కల్పనలు వంటి అంశాల మీద వారికి ఆసక్తి. అందుకు అను గుణంగానే సింగపూర్‌ రూపొందింది. అయితే, అదే క్రమంలో అక్కడి సమాజంలో సజీవత, సంతోషం తగ్గిపోయాయి. భారతీయ సమాజం ఎంతో చలనశీల మైనది, ఆటుపోట్లకు తట్టుకోగలిగినది. ఇటువంటి సమాజం లోకి అకస్మాత్తుగా పైస్థాయిలో సాంకేతికత ప్రవేశింపజేస్తే అనేకమంది అభివృద్ధి నుంచి దూరమైపోతారు” 

– సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన సామాజిక మనస్తత్వ వేత్త హూయింగ్‌ ఎన్‌జి  (డిసెంబరులో హైదరాబాద్‌లో  జరిగిన ఒక సదస్సులో ఈ హెచ్చరిక చేశారు) 

జీవనవైవిధ్యాన్ని మింగేసిన కొండచిలువ(హైవే ప్రయాణం)చెట్లనీ, చేలనీ, చెరువుల్నీ, పశువుల్నీ, వీటన్నిటి ఆలంబనగా సాగే జీవన వైవిధ్యాన్ని  మింగేసి పడుకున్న కొండచిలవలా వుంది నేషనల్ హై వే . అపార్టు మెంటులో పడుచుపిల్లలు భయపెట్టీ బతిమిలాడీ మాకూ, కారుకీ పులిమిన హోళీ రంగులతో ఒంగోలులో బంధువుల ఇంట పెళ్ళికి ప్రయాణం మొదలైంది. 

రాజమండ్రి నుంచి ప్రారంభమైన ప్రయాణంలో ఐదోనెంబరు జాతీయ రహదారికి రెండువైపులా పట్టణాలకు గ్రామాలకు దగ్గరగా వున్న పొలాల్లో పచ్చదనపు ఆచ్ఛాదన పోయి నేల నగ్నంగా మిగిలుంది. మట్టితోపాటు చెట్లనీ తవ్వేసి నాటిన ఇసుకా సిమెంటూ బిల్డింగులై మొలుస్తున్నాయి. వాటికి ఎరువు అన్నట్టు ఉరు చివర్లలో వాడి పారేసిన ప్లాస్టిక్ సంచులు భూమిమీద పొరలు పొరలుగా పేరుకుపోతున్నాయి. ఊళ్ళకు దూరంగా వున్న నేలమీద పైర్లు వున్నా పౌష్టికాహారంలేని సోమాలియా పిల్లల్లా గిడసబారిపోయినట్టున్నాయి. 
వాటి పచ్చదనంలో కళాకాంతులు లేవు. చమురు కాలిన పొగ ధూళి పంటల్ని కమ్ముకున్నట్టు వుంది.

దారిపొడవునా జీవన వైవిధ్యం కాక మూసపోసిన జీవితమే ఎదురైనట్ట అనిపించింది. 
ప్రయాణంలో రెండువేపులా పొలాలు, చెట్లు వుండేవి. పొలాల్లో క్రిమికీటకాలు తినే పక్షులు చెట్ల మీద కాపురముండేవి. పశువుల గాయాల్ని క్లీన్ చేసే పక్షుల్ని వాటికి దురదొస్తే గోకే పిట్టల్నీ చూశాం.సువిశాలమైన పొలాలు పాడైపోయి, పెద్దపెద్ద చెట్లు లేకుండాపోయాక ఆధారంలేక పశువుల పక్షులు ఈ మార్గంనుంచి ఎటో వెళ్ళిపోయాయి. 334 కిలోమీటర్ల (రాజమండ్రిలో మా ఇంటి నుంచి ఒంగోలులో మేము దిగిన హొటల్ వరకూ వున్న దూరం) ప్రయాణంలో రోడ్డు పక్కన ఒక్క పశువు కూడా కనిపించలేదు. పొలాల్లో రైతులు కనిపించలేదు. టోల్ గేట్ల వద్ద విసుగూ విరామంలేకుండా నిలువుకాళ్ళ జపంచేసే గుమాస్తాలగానో , గార్డులగానో వేరుశెనక్కాయలు అమ్ముకునే సర్వీసు సెక్టారులోకో రైతులూ రైతు కూలీలూ డంప్ అయిపోయారనే అర్ధమైంది. 

హైవేలో రెస్టారెంట్లు లేవు వున్నా బాగోవు కాబట్టి ఇంట్లో చేసి తెచ్చుకున్న పులిహోర ఏ చెట్టుకిందైనా తినొచ్చని అనుకున్నాము. ఎంతదూరానికీ చెట్టే లేకపోవడం వల్ల ఆకలిక పెరిగిపోయి కారు ఓ పక్కగా ఆపి లోపలే కూర్చుని కడుపు నింపుకున్నాము. ఆశోకుడు అనగానే ‘చెట్లు నాటించెను’ అనే ఎందుకు చెబుతారో రోడ్ల పక్కన చెట్ల అవసరం ఏమిటో అనుభవమయ్యింది. 

ఆకులు రాలే శశిరరుతువులో పచ్చదనం షేడ్స్ మార్చుకుంటూ ఆకు ఆరెంజ్ రంగులోకీ, కాండం బూడిద రంగులోకి మారుతాయి. ఆకాశంలో కూడా ఈ రంగులే వేర్వేరు షేడ్స్ లో కనిపిస్తాయి. ప్రకృతితో జీవనం ముడిపడివుండటం ఇదే. ఎంతదూరం చూసినా ‘తెల్ల’ మొహం వేసుకున్న ఆకాశం పేలవంగా కనిపించింది.

కారు నడపడం నాకు మీద ఆసక్తి పెరగడం బాగానే నడపడం, కాలి బొటన వేలు గాయపడిన స్ధితిలో కూడా నా చిన్న కొడుకు బాగా డ్రయివ్ చేయడం, నా భార్య ఆమె కజిన్ చెల్లి ఏకధాటికగా ఇతర కజిన్లనురించి చెడూ, మంచీ ముచ్చటించకోవడం, పెళ్ళి కొడుకు ఇంట్లో, వాడి పిన్ని ఇంట్లో మర్యాదగా మాతో తెగతినిపించేయడం కూడా హోళీనాడు నన్ను పులుముకున్న రంగులే! 


ఊహా, ఉద్వేగం – రంగే!హోళీ వెలవని జ్ఞాపకమే!!


రంగులు పలకరిస్తాయి…రంగులు పరవశింపజేస్తాయి…రూపాలనుంచి విడిపోయిన రంగులు ఒక ఉద్వేగం…రూపాలు కౌగలించుకున్న రంగులు మరో ఎమోషన్.. 
రంగుల్లేకపోతే ఊహలూ లేవు…అసలు మనిషి ఊహలు అనువాదమయ్యేది రంగుల్లోనే…

చెప్పలేనంత కృతజ్ఞతతో దేవుణ్ణీ, అంతుచిక్కని భయంతో దెయ్యాన్నీ సృష్టించుకున్న మనుషులు మిగిలిన అన్ని ఉద్వేగాలకూ రూపాల్ని అనుభవాలు అనుభూతల నుంచే తీర్చిదిద్దుకున్నరు. 

మనసన్నాక తుళ్ళింతా వుంటుంది. దానికి రంగూ రూపూ ఊపూ ఇచ్చిన మనిషి సృజనాత్మకత ప్రకృతినుంచి నేర్చుకున్నదే. ఇలా మనకొచ్చిన వాటిలో “హోలీ”ఒక రోమాంఛిత/రొమాంటిక్ వేడుక

ఉత్తరాదినుంచి “హోలీ” తెలుగునాట కాలు మోపి పడుచుపిల్లలకే పరిమితమైన “కోలాటం”తో కాలుకదిపి స్ధిరపడిపోయింది. ఈవాతావరణం రాజమండ్రిలో కనిపించని రోజుల్లో, 2001 లో కృష్ణుడు పెరిగిన బృందావనంలో (వృందావన్) నేనొక్కణ్ణీ హోలీ ఆట చూశాను. 

ఆసయమంలో న్యూఢిల్లీలో లక్ సభ స్పీకర్ (బాలయోగి గారు) నివాసంలో 14 రోజులు అతిథి గా వున్నాను. హోలీకి ముందురోజు స్పీకర్ పిఎ సత్తరాజుగారు వృందావన్ వెళ్తారా బాగుంటుంది అని అడిగారు. నా కూడా ఇంకెవరూ లేరు. ఏమీతోచనితనం వల్లా, కుతూహలం వల్లా సరేనన్నాను. 

కృష్ణజన్మస్ధానమైన మధుర, కృష్ణుడు పెరిగిన వృదావనం, హోలీ పండుగల గురించి ఆరాత్రి ఇంటర్ నెట్ లో సెర్చ్ చేసి ప్రింట్లు తీసుకున్నాను. నా కోరిక ప్రకారం ఇంగ్లీషు వచ్చిన కేబ్ డ్రైవర్ ని ఏర్పాటు చేశారు.

కారు రంగుల్లో తడిసిపోయింది. ముందుగా మధురలో కేశవదాస్ స్వామి (కృష్ణుడు) ఆలయానికి వెళ్ళాను. కూడా డ్రయివర్ వున్నాడు. అతని దగ్గర సత్తిరాజు గారు ఇచ్చిన ఉత్తరం వుంది. దానివల్లే పండగ రష్ లో కూడా మాకు క్యూతో నిమిత్తంలేని ప్రత్యేక దర్శనం దొరికింది. పాలతో కృష్ణుడికి స్నానం చేయించి ఒళ్ళు తుడితే అవకాశం కుదిరింది. ఆవాతావరణం శుభ్రంగాలేదు. పండితుల ను చూస్తే వీళ్ళు స్నానాలు చేసి చాలా రోజులయ్యిందేమో అనిపించింది. ఆమాటే అంటే డ్రయివర్ నన్ను చాలా కోపంగా చూశాడు.

అక్కడి నుంచి పదకొండింటికి వృందావన్ చేరుకున్నాము. కృష్టుడు పెరిగిన ఆ ఊరిలో బాగా తీర్చిదిద్దిన పెద్దతోట. ముదురు ఆకుపచ్చ ఆకులు. బూడిదరంగు కాండాలు. వేళ్ళతో నొక్కితే స్పర్శకు అందిన మెత్తని అనుభవం …ఒక మనిషిని ముట్టుకున్నంత మృదువుగా అనిపించింది. 

ఆచెట్లలో మామిడి రావి బాదం చెట్లను గుర్తుపట్టగలిగాను. అన్నీ పూల మొక్కలే ఎన్నోరంగురంగుల పూలు. గుంపులు గుంపులుగా మనుషలు. రంగులు పూసుకుంటూ…పులిమించుకుంటూ… అక్కడ ఉత్సాహమంతా పడుచు అమ్మాయిలూ, స్త్రీలదే. 

నల్లటి నారంగూ, ఆకారాల వల్ల ఉత్తరభారతీయుల మధ్య నేను ప్రత్యేకంగా కనబడుతాను. అక్కడ ప్రతీ ఒక్కరూ నన్ను కుతూహలంగా చూసినవారే. చాలమంది పలకరింపుగా నవ్విన వారే. ఒకావిడ వచ్చి ఏదో అని చేత్తో నొసటిమీదా చెంపల మీద రంగు పూసేసింది. బహుశ హిందీలో ఆమె నాకు శుభాకాంక్షలు చెప్పిందేమో. 

తరువాత అందరూ నన్ను రంగుల్లో ముంచేశారు. నాకూ రంగులు ఇచ్చారు. ఆరంగలు నా అసలు రంగుని కప్పేశాయి. రెండుగంటల సమయంలో నేనున్న చెట్టుకింద భోజనాలకు చేరిన ఒక కుటుంబంలో పెద్దావిడ నాకు రెండు ఆలూ పరాటాలు ఇచ్చింది. ఒకటే తీసుకున్నాను. అదితినేశాక రెండోది కూడా తీసుకుని వుంటే బాగుండేది అనిపించింది. ఆకలివల్ల కాదు అపరిచితునిపట్ల కూడా ఆదరణ చూపగల స్త్రీ అర్ధ్రతను గాఢంగా అనుభూతి చెందడానికే…

మంచుకురిసే హేమంతరుతువూ, కొత్తపూత పట్టే వసంతరుతువూ ఇచ్చే ఆహ్లాదం అంతా ఇంతాకాదు. ఈ సంతోషం ఓపలేనిదై, మనుషుల్లో రంగులై పొంగి, నృత్యమై నడుము ఊపి, చూపరులను ఉత్తేజభరితులను చేసి చిన్నగా చిందేయించిన అనుభవాన్ని బృందావనంలో పొందగలిగాను 

యవ్వనంలో ఆవేశం, ప్రేరకమై మనిషిని వదలని ఒక కాంక్ష ను కుదిపేయడం అపుడే అనుభూతి చెందగలిగాను.

అంతరాలు అరమరికలు లేని స్నేహోల్లాసపు మనిషితనానికి హోలీ ఒక ప్రతీక అని అపుడే అర్ధం చేసుకున్నాను. మూడ్, యాంబియన్స్ (కూడా) ఎంత ఎగ్జయిట్ మెంటు ఇస్తాయో చూపించే రొమాంటిక్ వేడుక కాబట్టే  “హోలీ” ఎవరికైనా పండగే! –   

మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలు!!!

(ఈ జ్ఞాపకం వయసు పద్నాలుగేళ్ళు . ఇప్పటికీ ఆ అనుభూతి అంతే గాఢంగా వుండటం నేను ఒక ఎమోషనల్ మనిషినని అర్ధమైపోతూనే వుంది. వయసు పెరుగుతున్న నా ఆరోగ్యానికి ఇది మంచో చెడో తెలీదు 🙂

ఆంధ్రుల ఆశని నమ్మించి  తగలబెట్టేసిన బిజెపి బడ్జెట్ 


ఆశ…కేవలం తొమ్మిదినెలల్లోనే ధైర్యంలా ఆవిరైపోయింది. దిగులు లాగ ముఖాన్ని కమ్ముకుంది. వెలుగు లాగ మసకబారింది. దీపం లాగ కొడిగట్టిపోయింది. అన్యాయమైపోయిన నిస్సహాయులకు దొరికే ఆశ నెరవేరకపోయినా కూడా అలాంటి భరోసా ఇచ్చిన వారి మీద ప్రేమను జీవితాంతం మరచిపోకపోవడమే ప్రజాసామాన్య లక్షణం. ఈ పాటి ఇంగితమైనా లేని బిజెపి ఆశను మోసంగా మార్చేసింది. పెంచుకుంటున్న ప్రేమను మెడపట్టి గెంటేసింది. కాంగ్రెస్ ఆంధ్రాకు కేవలం అన్యాయమే చేస్తే బిజెపి నమ్మక ద్రోహమే చేసింది. ఏబడ్జెట్ రోజునైనా ఇన్ కమ్ టాక్స్ లిమిట్ పెంచారా, నేను కొనే, కొనాలనుకునేవస్తువుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనిమాత్రమే చూసే వాణ్ణి…నిన్న కోట్లాది మందిలాగే నేను కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏమేమి కేటాయించారని మాత్రమే చూశాను…చాలా మందిలా నా నిరాశ బిజెపి మీద అసహనైపోయింది. వాజ్ పాయ్, అధ్వాని లాంటి పెద్దమనుషులు నడిపించిన పార్టీలోకి మోడీ లాంటి నోరేసుకు పడిపోయే సీ్ట్రట్ ఫైటర్లు చొరబడిపోయాక ఇచ్చిన మాట నిలుపుకునే ధర్మగుణానికి చోటెక్కడన్న ఏవగింపే మిగిలింది. 

ఆంధ్రప్ర దేశ్‌ రాషా్టన్రికి ప్రత్యేక హోదాని ఇచ్చే అంశం కేంద్ర బడ్జెట్‌లో అసలు ప్రస్తావనకే రాలేదు. ప్రత్యేక ప్యాకేజీపైనే కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈవిషయమై కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆశల పై నీళ్లు చల్లారు. ఆంధ్రప్రదేశ్‌ రాషా్టన్రికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రక టించారు. అయితే  ఎన్‌డీఏ బడ్జెట్‌లో ఈ విషమై కేంద్రం విస్మరించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి కొత్త రాజధాని నిర్మాణ నిధుల విషయంలో కూడా కేంద్రం దాటవేత వైఖరి అవలంబించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు రెండు లక్షల కోట్ల రూపా యలు ఖర్చవుతుందని గతంలోనే కేంద్ర ఐఐటీ నిపుణుల బృందం అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చుకు సంబంధించి నిధుల కేటాయిం పు విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఈ ఆర్థిక సాయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఏడాదికి 10 వేల కోట్ల రూపాయ ల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయాన్ని చేస్తామని గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దీనిగూర్చి అసలు మాట్లాకపోవడంతో ఈ ఆర్థిక సాయం రాషా్ట్రనికి ఇస్తుందా లేదా అనేది సందిగ్దమే అవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి తొలి ఏడాది ఏర్పడే 15 వేల కోట్ల రూపాయల లోటును కేంద్రం భరిస్తుందని తేల్చిచెప్పినా అందుకు అనుగుణంగా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ఎక్కడా తీసుకురాలేదు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో దాని నిర్మాణానికి అయ్యే నిధులను కేటాయించే విషయంలోనూ రాషా్ట్రన్ని విస్మరించింది. కేవలం పోలవరం ప్రాజె క్టుకు మొక్కుబడిగా 100 కోట్ల రూపాయలను మాత్రమే 2015-16 బడ్జెట్‌లో కేటాయించింది. 

దీంతోపాటు గిరిజన విశ్వవిద్యాలయానికి 2 కోట్ల రూపాయ లు, ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి కోటి రూపాయలు, విశాఖపట్టణం మెట్రోకు 5.63 కోట్ల రూపాయలు, ట్రిపుల్‌ ఐటీకి 45 కోట్ల రూపాయలు, ఐఐఎన్‌సీఈఆర్‌, ఐఐటీకి, నిట్‌, ఐఐఎంలకు ఒక్కొక్క దానికి 40 కోట్ల రూపా యలు చొప్పున బడ్జెట్‌ కేటాయింపులు చేసి చేతులు దులుపుకొంది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తదుపరి ఆంధ్రప్రదేశ్‌లో సరైన వైద్య సౌకర్యా లు లేకపోవడంతో విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాషా్ట్రనికి ఎయిమ్స్ మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గతం నుండి కేంద్రాన్ని కోరుతోంది. దీనిపై గత సెప్టెంబర్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని, ఇందుకు 500 కోట్ల రూపాయలను ఆ బడ్జెట్‌ లో కేటాయించినా ఆ నిధులను ఇప్పటి వరకూ విడుదల చేయలేదు సరికదా 2015-16 బడ్జెట్‌లో తదుపరి నిధులను కేటాయించ లేదు. ఉమ్మడి రాష్ట్రం రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్‌కు ఇస్తూ పునర్విభ జన చట్టంలో పేర్కొని దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా అది ఇంత వరకూ అమలు చేయలేదు. దీనిపై కూడా బడ్జెట్‌లో ప్రస్తావిచకుండానే కేంద్రం జాగత్ర… పడడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో పాటు పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పన్నుల రాయితీలు, ప్రోత్సాహకాలు, ద్రవ్యజవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనలను సడలించడం వంటి అంశాలను అమలు చేయాల్సి ఉన్నా వాటి ఊసే ఎక్కడా లేకుండా పోయింది. 

వెనుక బడిన ప్రాంతాలకు ఇచ్చే నిధుల నుండి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇటీవల 500 కోట్ల రూపాయలను మంజూరు చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత 2015-16 వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందించనున్నట్లు పేర్కొంది. దీనికి తగినట్లుగా బీహార్‌, బెంగాల్‌ రాషా్టల్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాషా్టన్రికి వెనుక ప్రాంతాలకిచ్చే ఆర్థిక సాయాన్ని ఇస్తామని వెల్లడించినా దానిపై స్పష్టత మాత్రం లేకపోవడంతో అది ఎంత వరకూ అమలు చేస్తుందనేది సందేహాస్పదమే అవుతోంది. వీటికి తగినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌డీఏ ప్రభుత్వం సెప్టెంబర్‌ బడ్జెట్‌లో వెల్లడించింది. దీంతోపాటు, విశాఖపట్టణం-చెనై్న పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, దాని అభివృద్ధికి ప్రోత్సాహకాలను కల్పిస్తున్నట్లు ఆ బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. కాకినాడ పోర్టుకు సమీ పంలోని ప్రాంతాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తిస్తారు. అలాగే నెల్లూ రు జిల్లా కృష్ణపట్నం ఓడరేవుకు అదనపు నిధులు లభించనున్నాయి. కృష్ణపట్నం లో ప్రత్యేక నిధులతో ఇండసి్ట్రయల్‌ స్మార్ట్ సిటీని కూడా ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు. వీటితోపాటు అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్‌ కస్ట మ్‌‌స అండ్‌ ఎకై్సజ్‌ అకాడమీని ప్రతిపా దించారు. అయితీ వీటిని గూర్చి ప్రస్తా వించకపోగా, అందుకు అవసరమయ్యే నిధులను 2015-16 బడ్జెట్‌లో ఎక్కడా కేటాయించక పోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రాజెక్టు లు అసలు అమలు జరుగుతుందా లేదా అనేది సందేహాస్పదమవుతోంది.

Blog at WordPress.com.

Up ↑