ఆశనిరాశల మధ్య, ఉద్రేక ఉద్వేగాల మధ్య, నిరీక్షణలు నిస్పృహల మధ్య కొట్టు మిట్టాడే కోటాను కోట్ల ప్రజల్లో నేనూ ఒకడి కాబట్టి, నా ఆలోచనలు స్పందనలు గడ్డకట్టుకు పోలేదు కాబట్టి, బతికుండగానే శవపేటికలో కూర్చోలేను కాబట్టి…
నువ్వు నన్ను మెసేజీల కొద్దీ తిట్టిన అనేక బూతుల్లో “ఎందుకు ఓ చించేసుకుంటున్నావు” అన్న ప్రశ్న ఒక్కటే నాకు ఆసక్తి కలిగించింది. ఆలోచిస్తే దొరికిన సమాధానమే ఇది.
నిజమే! నేను ఏమీ చేయలేని వయసు పైబడుతున్న రోగగ్రస్తుణ్ణే! నాది పడకకుర్చీ ఉద్యమమే !! నేను నీ పక్షం కాదు. ఏపక్షమూ కాదు. నేను నేను సంఘజీవిని. సంఘంలో జరుగుతున్న మంచి చెడులను ఆలోచించకుండా, స్పందించకుండా వుండటానికి నేను మాడిపోయిన బల్బుని కాదు…
నిన్ను నువ్వు వెలిగించుకో బాగుంటుంది! శుభోదయం
One response to “నా మీద అసహనంతో వున్న మిత్రునికి….”
తమసోమా జ్యోతిర్గమయ
LikeLike