Month: June 2015
-
బిజెపి మీద అవినీతి మచ్చలు !(శనివారం నవీనమ్)
పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్ అవినీతిని దుమ్మెత్తిపోసి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతి మచ్చల్ని వొదిలించుకోలేనంత గాఢంగా అంటించుకుంది. ఒక్కొక్కటిగా బయట పడుతున్న బిజెపి నేతల అవినీతి, అక్రమాలు ఆ పార్టీకి తల బొప్పి కట్టిస్తున్నాయి. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, స్మృతీ ఇరానీ, పంకజ్ ముండే – ఈ నలుగురూ పార్టీలోని శక్తివంతమైన మహిళలే! సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, పంకజా ముండే అక్రమాలతో […]
-
జీవనశూన్యంలో నైతికతను వొంపే తీర్ధయాత్ర!
మూఢభక్తితోకానీ, చేసినతప్పులన్నీ రద్దయిపోతాయన్న అత్యాశ వల్లగానీ, ఓ సారి చూసివద్దాం అన్న కుతూహలం వల్లగానీ, అవవాటుగా పెరుగుతున్న యాత్రావినోదంగాకానీ, ప్రజల్లో ఆలయాల సందర్శన పెరుగుతూవుంది. ఇవాళ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ సందర్శన తో సహా కొంతకాలంగా కుటుంబసమేతంగా నేను చేస్తున్న తీర్ధయాత్రల్లో చాలా విషయాలు గ్రహిస్తున్నాను. జీవితాన్ని ఆక్రమించుకుంటున్న శూన్యాన్ని పుణ్యక్షేతా్రలు, తీర్ధయాత్రలూ నింపుతున్నట్టున్నాయి. దర్శనాలు, పూజా క్రతువుల ద్వారా ఒక నిబద్ధతను, ధార్మిక ప్రసంగాల వల్ల ఒక ప్రాతిపదికను, ఆధ్యాత్మిక భావాల వల్ల తాపత్రయాలు […]
-
కెసిఆర్ దూకుడు – సెక్షన్ 8 అడ్డుకట్ట! (శనివారం నవీనమ్)
ఓటుకినోటు కేసులో న్యూస్ టివిల బ్రేకింగ్ న్యూస్ లు ఆగిపోయాయి. తెలంగాణా పాలకపక్షమైన టిఆర్ఎస్ నుంచి మీడియాకు లీకులు ఆగిపోవడమే ఇందుకుమూలం. తెలుగుదేశం అధినేత పట్ల చర్యతీసుకునే విషయంలో టిఆర్ఎస్ అధిష్టానం ఆలోచనలు మారుతున్నాయనే ఈ పరిణామాల్ని అర్ధం చేసుకోవాలి. ప్రతియాక్షన్ కీ రియాక్షన్ వుంటుందన్న సూత్రం భౌతికశాస్త్రం లో ప్రత్యక్షంగా కనిపించదేమోకాని రాజకీయశాస్త్రంలో అడుగడుగునా ఎదురౌతూనే వుంటుంది. ఉద్యమకాలం నుంచీ కూడా ఆంధ్రోళ్ళపార్టీ అనిప్రచారంచేస్తూ తెలంగాణా ప్రజల్లో తెలుగుదేశం మీద ఈసడింపు, ద్వేష భావాలను టిఆర్ఎస్ […]
-
ఆకాశంతోపాటు నేలలోకీ చొచ్చుకుపోయిన చెట్టు!
తెలిసినదానినుంచి, తెలియనిదానినుంచి, ఊహలనుంచి, వాస్తవం నుంచి, ఎడబాటు అనుభవిస్తున్నపుడు సంబంధీకులకోసం వెతుక్కునే క్రమంలో నాకు ఇదొక జ్ఞాపకం. నా ఉనికికి పునాదైన ఆ స్మృతిని జీవితంలోకి అనువదించుకోవాలని తాపత్రయంగా వుంది. నిర్దాక్షిణ్యంగా ఒకవైపులాగేసే కాలానికి ఎదురీది తాపత్రయాల్ని నెరవేర్చుకోలేమని తెలిసి మనసు బెంగపడుతుంది. అయినా, కొత్త స్నేహాలు, సందర్భాలు, విషయాలూ జీవితాన్ని సుసంపన్నం చేయవలసిందే. బతుకు లోపలిపొరలనుంచి అనుభవాలు వెలికిరావలసిందే.తెలిసున్న సత్యాలను కొత్తనేస్తాలతో కలబోయవలసిందే. సంపాదించుకున్న గాయాలను సంక్రమించిన రత్నాలనూ ప్రదర్శించవలసిందే. పన్నెండేళ్ళకి ఒకసారి నదీపుత్రులంతా పుష్కర […]
-
ఓటు నోటు రగడఒక పౌరుడి స్పష్టీకరణ
నోటుకి ఓటు తగాదాలో ” ఇది తనను ఎన్నుకున్న 5 కోట్లమందినీ అవమానించడమే” నన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయంతో నాకు సంబంధం లేదనీ, ఆ అభిప్రాయంతో విభేదిస్తున్నాననీ స్పష్టం చేస్తున్నాను. ముఖ్యమంత్రి ప్రస్తావించిన కోట్లమందిలో నేనూఒకడిని అయివున్నందున ఈ వివరణ ఇవ్వవలసి వచ్చింది. కాంగ్రెస్ ఏకపక్షంగా విభజించిన రాష్ట్రంలో నేను నివశిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేస్తారన్న ఆశతో తెలుగుదేశం బిజెపి కూటమికి నేను ఓటు వేసిన మాట వాస్తవమే ఆదేవిధంగా నాబంధుమిత్రులను ప్రోత్సహించిన […]
-
విలువల్ని తొక్కేస్తున్న ఉద్వేగం రేవంత్ మీసంలో ఆంధ్రుల రోషం
టిఆర్ఎస్, తెలుగుదేశం సహా అన్నిప్రధాన పార్టీలూ సాధారణ ఎన్నికల్లో ఓట్లు కొంటున్నాయి. ప్రభుత్వాన్ని నిలుపుకోడానికి ప్రజాప్రతినిధులను పార్టీ మారేలా ప్రలోభపెట్టే సామదానబేధదండోపాయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయే. తిరుగులేని ఆధిక్యత కోసం గుత్తగా ఎమ్మెల్యేలను కొనే విధానాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుపెట్టారు. ఇదంతా అవినీతే…ఇలా సామాజిక ప్రాబల్యం, రాజకీయ అధికారం ఉన్నవారు బాహాటంగా అవినీతికి పాల్పడుతున్నా రాజకీయాల్లో ఇది మామూలేలెమ్మన్న మెట్టవేదాంతం ప్రజలబుర్రలోకి ఎక్కేసింది. రాజకీయ అవినీతికి ప్రత్యర్థులు కూడా పాల్పడినపుడు, టివిగొట్టాలముందో, పత్రికాగోష్టుల్లోనో గొంతుచించుకుని నీళ్ళుతాగి వెళ్ళిపోయే […]