అప్పు ఇచ్చేవాళ్ళు షరతులు పెట్టడం అసంబద్ధమేమీకాదు. అదేసమయంలో బయటి వ్యవస్ధల జోక్యం మన స్వతంత్రతకు, రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి భంగకరంకూడా. కేంద్రంలో,రాష్ట్రాల్లో ఏ పార్టీవారు అధికారంలో వున్నా ప్రపంచబ్యాంకు షరతులగురించి దాచిపెట్టి జనసంక్షేమానికి కఠిన నిర్ణయాలు తప్పవని ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రపంచబ్యాంకు లేదా అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల షరతులప్రకారమే తాము పధకాలు అమలు చేస్తున్నామని పారదర్శకంగా చెప్పిన ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రిగాని ఒక్కరూలేరు.
http://www.telugu360.com/te/world-bank-suggestions-to-indian-states/
మబ్బులు తేలిపోయాయి. నిర్మలాకాశంలో సగం చంద్రుడు. ముసురు వెలిశాక వుండే చల్లదనం…గాలి ఆడని ఉక్కపొత…శరీరాన్ని కొంత సౌకర్యంగా కొంత అసౌకర్యంగా వుంచుతున్నట్టు వుంది. అన్నిటికీ మించి కీచురాళ్ళు సంగీతం, కీటకాల రొద మూడు సీజన్ల తరువాత ఇప్పుడే రౌండ్ పార్కలో వినిపించింది…మీ ఊళ్ళో కప్పల మేళం వినబడుతూందా అని సెల్లార్ లో తారసపడిన శ్రీరామపురం నుంచి వచ్చిన పాల అబ్బాయిని అడిగితే ఇంకెక్కడి కప్పలు చైనా ఎక్స్ పోర్ట్ అంటగా అనేశాడు. ముందుటేడాదే వానల్లో కప్పలగోల వినబడింది. నిరుడూ ఈ ఏడాదీ ఆ మోతే లేదు. చేను మీదకంటే ఇళ్ళల్లోనే దోమలు పెరిగిపోయాయని కూడా చెప్పాడు.
పెత్తనం చేయాలన్న కాంక్ష, ఎదిరించాలన్న దీక్ష…ఈ రెండే ఆధునిక చరిత్రలో అగ్రరాజ్యాలలో అందునా అమెరికా అనుకూల, వ్యతిరేక ప్రపంచాన్ని విభజించేశాయి. వృద్ధి చెందుతున్న దేశాల సహజశక్తులూ, మెరుగులు దిద్దుకుంటున్న నైపుణ్యాలూ, ‘పెద్దన్నల’ వాణిజ్య సైనిక పెత్తానాలను నిలువరించే దశకు పదునెక్కుతున్నాయి. వాస్తవాలను అర్ధంచేసుకోవడం వల్లో మరో మార్గలేకపోవడం వల్లో ఆధిక్యత చెలాయించే ధోరణి నుంచి ఇచ్చిపుచ్చుకునే పంధాలోకి మారిందంటున్న నేపధ్యంలో కూడా భారతదేశానికి అమెరికా నమ్మదగిన నేస్తమేనా అన్న ప్రశ్న చర్చకు వస్తూనే వుంటుంది.
http://www.telugu360.com/te/is-united-states-reliable-friend-to-india/
ఏడాదిలోకావలసిన పనులను ఆరునెలలలోనే గొంతు మీద కూర్చుని పూర్తి చేయించిన అనర్ధమే ఇదని జలవనరులశాఖలో సిబ్బందిని ఎవరిని కదిలించినా తిట్టుకుంటున్నారు
http://www.telugu360.com/te/river-interlinking-aqueduct-breaches-within-hours-of-launch/
ఇది భాద్రపదమాసం లాగేవుంది. పట్టణంలో తట్టుకోలేనంత, పొలంలో చాలీచాలనంత హర్షరుతువులాగే వుంది. నేల అలంబన మీద, నాలుగు చినుకుల ఊతాన్ని అందుకుని పచ్చదనం వెల్లివిరుస్తోంది.
వేలవేల రంగుల్లో వెలుగు సోకిన వర్ణమే ధగధగలాడుతుంది. బొమ్మలు గీసే ప్రకృతి ఇపుడు ఫోకస్ లైటు ముందుకి ఆకుపచ్చ రంగుని తీసుకొచ్చినట్టుంది. ఇది కనిపించని మసకవెలుగుల సూర్యకాంతి తో కలసి కొత్త ఛాయను తెచ్చింది. ఇది బూడిదరంగు రోడ్డుమీద, ఆకాశపురంగు ఆస్పత్రిమీద, గోధుమరంగు ఇంటిమీద వ్యాపించి కొత్త శోభను పులిమినట్టుంది.
గాలిలో కలసిపోయిన రంగుల శోభ గుమ్మాలనుంచీ, కిటికీలనుంచీ వెంటిలేటర్లనుంచీ ఇళ్ళలో ఆవరించి, టివిలో బొమ్మతో సహా ప్రతి వస్తువుకీ
వర్షపు శోభను పూసినట్టు వుంది. మంత్రించిన పారదర్శకతను చిలకరించడం ఇదేనేమో!
రెయిన్, రెయినీ డేస్ మధ్య సమతూకం పోయి చాలాఏళ్ళయింది. వాన కురిసి కురిసి ఆగుతోంది…ఆగి ఆగి కురుస్తోంది…తెరలు తెరలుగా వర్షం పడుతోంది.
నాకయితే ఇది నాలుగైదేళ్ళతరువాత మళ్ళీ వర్షరుతువులో ఒక కేరింత అనిపిస్తోంది.
ఆదివారం శుభోదయం
తేలికగా కోతకు గురయ్యే నేలలమీద కుండపోత వానల వల్ల నీటి జాలులు ఆకస్మికంగా వరదకాల్వలైపోతాయి. రాజమండ్రి దగ్గరలో చక్రద్వారబంధం అనే చిన్న ఊరిలో ఈ మధ్యాహ్నం కురిసిన భారీవానకు చిన్న వరద కాల్వే తయారైంది. రోడ్డు కింద నేలను కోసేస్తోంది. ఇది ఎర్ర ఇసుక నేలల వాలు ప్రాంతం. వాననీటిని నేలలోనే ఇంకిపోయేలా చూడటానికి పొలాలను మడులుగా విభజించి కరకట్టలు (గట్లు) వేసేవారు. వ్యవసాయానికి అడ్డుకాని కాలంలో తుప్పలు పొదలను యధేచ్చగా పెరగనిచ్చేవారు. అవి వానాకాలంలో నేలకోతను నివారించేవి. భూసారం కొట్టుకుపోకుండా ఆపేవి
ఇపుడు కంటికి విశాలంగా కనిపించేలా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసం భూమిని చదునుచేసి వుంచుతున్నారు. ఫలితంగా చిన్నవానకే నేలకోత తప్పడంలేదు. ఎంతోకొంత భూసారం కొట్టుకుపోక ఆగడం లేదు.
గెలవాలన్న కోర్కెకంటే ఆధిపత్యం కోసం పోరే అధికమై ములాయం సింయాదవ్ తప్పుకోవడం, దేవగౌడ మొహం చాటు చేయడంతో బీహార్ లో జనతాపరివార్ పుట్టకమునుపే చనిపోయింది. గెలుపే ముఖ్యమనుకున్న బిజెపి 160 సీట్లకే పోటీకి పరిమితమై మిగతా సీట్లను మిత్రులకు కేటాయించింది…
http://www.telugu360.com/te/బీహార్-ఎన్నికలు-సీట్ల-సర/
అత్యధికమైన వృత్తి నైపుణ్యాలు బిసిల చేతుల్లోనే వున్నాయి. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సానబట్టే ‘నైపుణ్యభారత్’ సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. రామస్వామి పెరియార్ సాంఘిక ఉద్యమాల ద్వారా బిసిలను కూడగట్టారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయపార్టీల్లో ప్రాబల్యం బిసిలదే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ ‘ఆదరణ’ పధకం ద్వారా బిసిల ఆర్ధిక ఉన్నతికి దోహదపడ్డారు. అది తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అయ్యింది.
నేడు 63 వ సంవత్సరంలో ప్రవేశించిన నరేంద్రమోదీ ‘స్కిల్ ఇండియా’ దేశవ్యాప్తంగా బిసి ఎంపవర్ మెంటుకి బాటవేస్తుంది.
http://www.telugu360.com/te/india-to-lead-transformation/
గత్యంతరం ఒకటుంటుందన్న స్పృహ కూడా లేకుండా జీవన గమనాలు గంతలు కట్టుకున్న చూపుల వెంట అలవాటైపోయిన సర్కస్ నడకలా సునాయాసంగానే గమ్యం చేరుకుంటూనే వుంటాయి. తండ్రివో, తల్లివో, కూతురివో, కొడుకువో, పనివాడివో, యజమానివో, దొరవో, వెధవవో…ఎవరివైనా సరే ఒక ఆర్బిట్ లో ప్రవేశించాక ఏ కక్ష్యలో పరిభ్రమణం వారిదే.
ఈ ప్రయాణంలో విసుగునీ, భారాన్నీ, విరక్తినీ తొలగించడానికో ఏమో,
– ప్రయాసపడి భారాన్ని మోసేవారందరికీ ద్వారాన్నీ మార్గాన్నీ తానేనని దైవకుమారుడు ఇచ్చిన భరోసా…
– సర్వశక్తిమంతుడైన దైవం ఒక్కడే, మరే ఆరాధన అయినా అవిశ్వాసమే అన్న ప్రవక్త కనువిప్పూ…
– సర్వ సంశయాలూ విడిచి పెట్టి తననే శరణుకోరమని గీతాకారుడు ఇచ్చిన అండా…
మనిషి ఇచ్ఛను దేవుడి అధీనం చేయడానికి దారులు వేశాయి.
ఇందుకు ప్రలోభంగా లభించే మనసు ప్రశాంతతా, వేడుక వాతావరణమూ పండగే! పండగే!!
కుడుములు లంచమిచ్చి, పనిముట్లు పూజలోపెట్టి ,కోర్కెలు తీర్చమనే వేడికోలు ఇంటిల్లపాదికీ సంబరమే!!
Recent Comments