అతి సున్నితమైన, అత్యంత సూక్ష్మమైన సంవేదనలను (senses) కూడా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం గుర్తించడమూ ఒక విధంగా నిశ్శబ్దానికి భంగమే!
పంచేంద్రియాల అనుభూతికి అందని మౌనమే నిశ్శబ్దం.
కేవలం ఊపిరితీసుకోవడం విడిచిపెట్టడం మీద కాసేపు దృష్టి సారించగల ఏకాగ్రత అలవడింది కాని, నిశ్శబ్దంలో ఆనందం అనుభవమవ్వడం లేదు. ఈ సాధన చిన్న విషయం కాదు…అది నావల్లకాదు కూడా!