Month: October 2015

  • గోదావరిలో నీటి ఎద్దడి 

       గోదావరి డెల్టాలో రెండో పంటకు నీటి ఎద్దడి పదమూడేళ్ళనాటి తీవ్రతకు మించి వుండగలదని ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇది కనీసం మూడువేల కోట్లరూపాయల వ్యవసాయిక ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించి చరిత్రను తిరగ రాయాలని రైతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాజెక్టు కమిటీ భావిస్తోంది. కమిటీ, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా రైతుల్ని ఏమేరకు మోటివేట్ చేయగలరు అన్నదాన్ని బట్టే ధాన్యాగారమైన గోదావరిజిల్లాల్లో రెండో పంట స్ధితీగతీ వుంటాయి. […]

  • వెన్నల కాలం 

    శీతోష్ణాల సమస్ధితి వల్ల శరీరానికి అలసటలేదు. పెద్దగా మెడికేషన్ లేకపోయినా వారంలోనే వైరల్ ఫీవర్ తగ్గడానికి క్లయిమేటే కారణం అనిపిస్తోంది. ఏమైతేనేమి హైదరాబాద్ లో వారంరోజులు వృధాపోయాయి. అసలే చెమట పట్టని హైదరాబాద్…ఆపై వేడితక్కువ వెన్నెల ఎక్కువ అయిన శరదృతువు. ఆకులు రాలేదీ, రంగురంగుల డిజైన్ల శీతాకోక చిలుకలు గుంపులు గుంపులు గా సంచరించే కాలం వచ్చేసింది.  రాజమండ్రిలో మాదిరిగానే నిజాంపేటలో కూడా నా ఇంటికి 350 మీటర్ల దూరంలోనే పార్కు వుంది. అది పచ్చటి రౌండ్ […]

  • కల్చరల్ పోలీసింగ్ పై ఆవేదన అవార్డుల వాపసుతో రచయితల నిరసన

    మతద్వేషం, ప్రశ్నించే వారిపై దాడులూ, ఆందొళనకరంగా పెరిగిపోతున్న ”కల్చరల్ పోలీసింగ్” పై రచయితల అవేదనకు, నిరసనకూ ఉన్నత స్ధాయి నుంచే స్పందన రావాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలి…దురదృష్టకరం…మాకు సంబంధంలేదు వంటి పొడిపొడి ఖండనలు కాకుండా ఆవేదనకు ఉపశమనం కలిగించాలి. http://www.telugu360.com/te/writters-refunding-govt-awards-in-protest/   

  • హుదూద్’ ఇళ్ళు కట్టలేదు సరే! 260 కోట్ల విరాళాలు ఏమయ్యాయి మరి?

    ఉత్తరాంధ్ర, విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన ప్రచండ తుపాను ‘హుదూద్‌’ ప్రాంతాల పునర్నిర్మాణం మొదలుకాలేదు. బాధితుల సహాయ, పునరావాసాలపై ప్రభుత్వం హామీలు నెరవేరలేదు. ఒక్క పటిష్ట, శాశ్వత చర్య కూడా లేదు.తుపానుకి చితికపోయిన విశాఖ మురికివాడలను, మత్స్యకార ప్రాంతాలను చూస్తే ప్రచారంలోని డొల్లతనం ప్రత్యక్షమౌతుంది. http://www.telugu360.com/te/no-rehabilitation-even-after-1-year-hudhud/    

  • హోదా పై మాయమాటలు వొద్దు !

    హోదా” సంజీవనీ మంత్రం కాదని వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతూవుండి వుండవచ్చు. ”పెద్దకొడుకునై ఆంధ్రప్రదేశ్ కష్టం తీరుస్తా” అని తిరుపతి సభలో నమ్మబలికి అధికారం ఎక్కాక మూగనోము పట్టిన నరేంద్రమోదీ నమ్మకం కూడా అదే అయివుండవచ్చు. కానీ, ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించగలదని విద్యావంతులు, ఆలోచనాపరులు, మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని తటస్ధవాదులు నమ్ముతున్నారు. వైఎస్ జగన్ మోహన రెడ్డిని వ్యతిరేకించే వారు కూడా ఆయన నిరాహార దీక్షను శ్రద్ధాసక్తులతో పరిశీలిస్తూ వుండటమే […]