Month: November 2015
-
మోదీ ఎఫ్ డి ఐ దూకుడుపై – స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం!
26 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలన్న ప్రజాస్వామిక ధర్మాన్ని, కనీసం కేబినెట్ సహచరులతో చర్చించాలన్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి విదేశీ కార్పొరేట్ల ను సంతోషపరడానికి రాత్రికి రాత్రే ఎఫ్ డి ఐ అనుమతులపై ఉత్తర్వులు జారీ చేయించిన మోదీ దూకుడుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్ధ ఎస్ జె ఎం కూడా ఎఫ్ డి ఐ ల పై అభ్యంతరాన్ని ప్రకటించింది…
-
ఇది మతాతీత విశ్వాసం!
ఇది మతాతీత విశ్వాసం! ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము. జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి. పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని ఈ పెద్దమ్మ, మహంకాళి తల్లులు […]
-
బీహార్ పై సోనియా మౌనం!
కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసిన బీహార్ ఎన్నికల ఫలితాలే రాహుల్ రాజకీయ భవిష్యత్తుకి అవరోధంగా కూడా ఎదురౌతున్న క్లిష్టపరిస్ధితి సోనియా ముందు వుంది. బీహార్ పై సోనియా మౌనం!
-
”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?
హరితాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడవులు హరించుకుపోతూండటానికి కారకులౌతూండటం పెద్ద విషాదం. బాక్సైట్ తవ్వకాలతో కలిపి దాదాపు 50 వేల ఎకరాల అటవీ భూముల్ని డీ నోటిఫై చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరుతున్న నేపధ్యంలో లెక్కల్ని విశ్లేషించినపుడు ఉపన్యాసాలు మినహా పచ్చదనం పై చంద్రబాబు ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టిన సందర్భాలు లేవని బయటపడుతోంది. https://www.telugu360.com/te/can-we-call-as-harithandra-after-bauxite-mining/ ”హరితాంధ్ర”-ఈమాట అనే అర్హత వుందా?
-
”బాక్సైట్” మాట తప్పిన బాబు
మేం అధికారంలో ఉన్న ప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిన మాట నిజమే. అయితే, ప్రజాభిప్రాయాన్ని, పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ప్రతిపాదనను విరమించాం. స్థానిక గిరిజనుల అభిప్రాయాలను, పర్యావరణ సమస్యల ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం పట్టిం చుకోవడం లేదు.” విశాఖపట్టణంజిల్లా అనంతగిరి సభలో 2010 నవంబరు 18 న ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇచ్చారు. ”బాక్సైట్” మాట తప్పిన బాబు
-
పోరు బాటలో సీమ నేతలు?
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అనంతపురం జిల్లాలోనే సుమారు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయ ఆధారిత జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి కోసం ఇదే జిల్లా నుంచి ఐదు లక్షల మంది కూలీలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని సుగాలితాండాల మహిళలు పొట్ట నింపుకునేందుకు ఢిల్లీ, ముంబయి, పూణే తదితర నగరాల్లోని రెడ్లైట్ ఏరియాలకు తరలిపోవడం మరో విషాదం. పోరు బాటలో సీమ […]
-
ఎదుగుతున్న తెలుగు e పుస్తకం
ఆత్మకథలు, రాజకీయ చరిత్రలుఅంతగా లేని ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవాలు కూడా చరిత్రలో ఒక పార్శ్వమే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో కీలక ఘట్టాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో వున్నాయి. ఒక టెక్నాలజీ నుంచి మారిన జన జీవనశైలి అచ్చు పుస్తకాన్ని వెనక్కి పింపించింది. అయితే మరో టెక్నాలజీ మాయోమంత్రమో అన్నంత అద్భుతంగా సర్వర్లలో నిక్షిప్తమై వున్న పుస్తకాలను గాలిలోనుంచి తీసి కళ్ళముందు వుంచుతోంది. మొబైల్ గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లు జేబుల్లోకి చేరిపోతూండటంతో […]
-
మోదీ – బాబు ఎదురీత!
ప్రస్తుతానికి మనకి పనికిరాని ఈ అభివృద్ది మోడల్ ని వదిలేసి ఆర్ ఎస్ ఎస్ సూచించినట్టు భారతీయ నమూనా ను సిద్ధం చేసుకోవడమే ఉత్తమం…కాని పక్షంలో ”సస్టెయిన్ బుల్ మేక్ ఇన్ ఇండియా” దాదాపు అసాధ్యమే!