స్కిల్ ఇండియా


అత్యధికమైన వృత్తి నైపుణ్యాలు బిసిల చేతుల్లోనే వున్నాయి. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సానబట్టే ‘నైపుణ్యభారత్’ సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. రామస్వామి పెరియార్ సాంఘిక ఉద్యమాల ద్వారా బిసిలను కూడగట్టారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయపార్టీల్లో ప్రాబల్యం బిసిలదే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ ‘ఆదరణ’ పధకం ద్వారా బిసిల ఆర్ధిక ఉన్నతికి దోహదపడ్డారు. అది తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అయ్యింది.  
నేడు 63 వ సంవత్సరంలో ప్రవేశించిన నరేంద్రమోదీ ‘స్కిల్ ఇండియా’ దేశవ్యాప్తంగా బిసి ఎంపవర్ మెంటుకి బాటవేస్తుంది.
http://www.telugu360.com/te/india-to-lead-transformation/ 
  

స్మార్ట్ ఫోన్లు సరే చదువుకోడానికి గాడ్జెట్లు ఏవీ ?  


సోషల్ మీడియాలో రసేవారు ఎక్కువ చదివేవారు తక్కువ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లు, టాబ్ ల విస్తృతి ఇందుకు ఒక కారణం. పాఠకులు తగ్గిపోవడం వల్ల శక్తివంతమైన సోషల్ మీడియా టైంపాస్ / నాన్ సీరియస్ మీడియాగా మిగిలిపోతోంది

ఇపుస్తకాల్లో అత్యాధికం ఇంగ్లీషువే…వాటిలో ఇండియా నేపధ్యమున్నవి బాగా తక్కువ. కినిగే .కామ్ తెలుగు ఇ బుక్స్ ప్రచురిస్తోంది. కంప్యూటర్ లాప్ టాప్ లలోఇ పుస్తకాలు చదవడం స్మార్ట్ ఫోన్లు టాబ్ లేట్ల కాలంలో కొంత అసౌకర్యమే 

అన్ని భారతీయ భాషల్లో ఇపుస్తకాలు వచ్చెయ్యాలి వాటిని చదువుకోడానికి కిండల్ వైట్ పేపర్, కోబోగ్లో లాంటి రీడర్ గాడ్జెట్లు వచ్చెయ్యాలి 
ఇదంతా ఎప్పటికి జరుగుతుందో ?? 

 
(ఈ ఫొటోలో వున్నది సోనీ రీడర్ ఇందులో నేనుకొనుక్కున్న దాదాపు 400 పుస్తకాలు వున్నాయి. చదువుతూంటే తరచు హాంగ్ అయిపోతూంది. కొత్తది కొందామంటే సోనీ కంపెనీ ఇ రీడర్ల తయారీని నిలిపివేసింది. ఇందువల్ల ఎప్పుడు మరణిస్తుందో తెలియని సోనీ రీడర్ నాకు చాలా చాలా అపురూపమైంది.

అన్ని రీడర్ గాడ్జెట్లనూ మింగేస్తూ వస్తున్న అమెజాన్ వాళ్ళ కిండల్ రీడర్ తెలుగుపుస్తకాలను కూడా అందులోకి అనుమతిస్తుందని, అనుమతించాలనీ నా ఆశ)

ఒక మహావిజ్ఞానాకికి కేంద్రబిందువు జనవరి 14


పున్నమినుంచి అమావాస్యకీ, అమావాస్య నుంచి పున్నమికీ చంద్రబింబం ఒక క్రమపద్ధతిలో తగ్గుతూ హెచ్చుతూ వుంటుంది…చంద్రుడి హెచ్చుతగ్గుల కళలను బట్టి రోజుల్ని (తిధులు) లెక్కపెట్టడం చంద్రమానం. ఇది వ్యవసాయానికి అవసరమైన రుతువుల్ని సూచించదు. రుతువులు సూర్యుణ్ణి అనుసరిస్తాయి. సూర్యుడికి కళలు వుండవు. అందువల్ల సూర్యమానాన్ని లెక్కించడానికి కొంత నిపుణత కావాలి. ఏపరికరాలూ లేని యజుర్వేద కాలంలో పరంపరగా సాగిన నిరంతర పరిశీలన పరిశోధనలనుంచి మానవ మేధస్సు సాధించిన మహా విజ్ఞానమే ఈ కేలండర్

తూర్పునుంచి పడమరకు సూర్యుడు తిరిగే (తిరుగుతున్నాడనిపించే) దారి భూమికి నడినెత్తిమీద వుండదు…సూర్యుడు భూమి నెత్తి మీద ఆరునెలలు దక్షిణం వైపు ఆరునెలలు ఉత్తరం వైపు జరుగుతూ వుంటాడు. ఇదే దక్షిణాయణం, ఉత్తరాయణం…
ఇలా ఆయన అటూ ఇటూ తిరిగే సమయంలో ఉత్తర దక్షిణాల మధ్య భూమి నడినెత్తికి దగ్గర గా వుండే కాలాన్ని / సమయాన్ని గుర్తించారు. అదే జనవరి 14…అదే మకర సంక్రమణం. దక్షిణం చివరి నుంచి ఉత్తరం చివరి వరకూ సూర్యుడి ప్రయాణ మార్గాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. సూర్యుడు ఏభాగంలో ఉన్నాడన్నదాన్ని బట్టి అది ఏరుతువో తెలుసుకోవచ్చు…

సూర్యయానాన్ని 27 భాగాలుగా విభజించారు…ఒకోభాగానికీ ఒకో నక్షత్రం పేరుపెట్టారు… గ్రీకు ప్రభావంతో దీన్నే 12 భాగాలు గావిభజించి ఒకో భాగాన్నీ ఒకో రాశిపేరుతో పిలిచే పద్ధతి కూడా మనదే…సూర్యమానంలో రాశుల్నీ నక్షత్రాల్నీ సమన్వయం చేసుకుని రోజులతో సహా రుతువుల కేలెండర్ ని డెవలప్ చేశారు. ఆవిధంగా సూర్య యానం జనవరి 14 నుంచి ప్రారంభమౌతుంది

వ్యవసాయ విస్తరణకోసం పుట్టుకొచ్చిన కేలెండర్ లో రాహుకాలాలూ యమగండాలు బల్లిశకునాలు దుర్ముహూర్తాలూ చేరిపోయి పంచాంగమైంది…రుతువుల సమయాసమయాలు గుర్తించే ఖగోళ విజ్ఞానంలో రాశులు గ్రహాలు మనుషుల పుట్టుక సమయాలతో ముడిపడి జ్యొతిష పంచాంగమైంది

జీవన సాఫల్యం!


సుప్రసిద్ధ సర్జన్, జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి మెంటార్, రాజమండ్రి పౌరప్రముఖుడు
డాక్టర్ గన్ని భాస్కరరావు వైద్యరంగంలో నిబద్ధతా, నైపుణ్యాలపై ‘లైఫ్ టైమ్ ఎచీవ్ మెంటు’ అవార్డు అందుకున్నారు.

అహ్మదాబాద్ లో డిసెంబరు 27 న జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 89 వ నేషనల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ గన్ని కి ఈ అవార్డుని అందజేశారు.

ఐఎంఎ నేషనల్ ప్రసిడెంట్ డాక్టర్ జితేంద్ర పటేల్, కేంద్ర వైద్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్, గుజరాత్ వైద్య మంత్రి నితిన్ భాయ్ పటేల్, ఎంసిఐ చైర్మన్ డాక్టర్ జయశ్రీ మెహతా, కేతన్ దేశాయ్ మొదలైన మెంబర్లు, దేశవ్యాప్తంగా వైద్యరంగం ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

IMG_0574.JPG

IMG_1614.JPG