Category: శైలీధోరణులు

  • పిల్లలలో అసంబంధాలు / Unattached Life

    పెద్దాడ నవీన్) 20-7-2018 ఇంటికే పరిమితమైన సామాజిక జీవనం…లివింగ్ రూమ్ కే పరిమితమైన కుటుంబ జీవనం…మమ్మీ, డాడీ – వాళ్ళ తోబుట్టువులను, వారి బాధ్యతలను వొదిలించుకోడానికి చూపించే లౌక్యం, పడే శ్రమ…పైమెట్టు మీద వున్నవారితో పరిచయాలు పెంచుకునే తాపత్రయాలు, సంబంధాలు, స్నేహాలు… వ్యక్తిత్వ వికాసానికి అమ్మ నాన్నల గైడెన్స్ అవసరమైన టీనేజిలో మనోభావాల్ని, సహజస్పందనల్ని చిదిమేసే బ్రాండ్ (నారాయణ చైతన్య)చదువులు…అవసరానికి మించి యిచ్చే పాకెట్ మనీ…ఏమి తాగాలో ఏమి తినాలో ఏమిచెయ్యాలో ఎలా వుండాలో నిర్ణయించే మార్కెట్…వీటి […]

  • ఇది మతాతీత విశ్వాసం! 

    ఇది మతాతీత విశ్వాసం!  ఇవాళ సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళినీ, మొన్న హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లినీ చూశాము.  జీవితాన్ని కలుషితం చేసుకున్న మనం…నైతికతను కోల్పోయిన మనుషులం…అసంతృప్తులను చల్లబరచుకోడానికో శూన్యాల్ని పూడ్చుకోడానికో మతాన్ని కౌగలించుకున్నాం…మనిషి ఉనికిని ఆధ్యాత్మికత ద్వారా సిద్ధాంతీకరించే ప్రయత్నం చేసే మతం మీద నాకు తృణీకారమైతే లేదుగాని, మతం మీదకంటే గ్రామ దేవతలంటేనే ప్రేమ గౌరవాలు వున్నాయి.  పెద్దపెద్ద కళ్ళతో పసుపు పచ్చ శోభతో మూడడుగులు కూడా ఎత్తులేని ఈ పెద్దమ్మ, మహంకాళి తల్లులు […]

  • గోదావరిలో నీటి ఎద్దడి 

       గోదావరి డెల్టాలో రెండో పంటకు నీటి ఎద్దడి పదమూడేళ్ళనాటి తీవ్రతకు మించి వుండగలదని ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇది కనీసం మూడువేల కోట్లరూపాయల వ్యవసాయిక ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించి చరిత్రను తిరగ రాయాలని రైతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాజెక్టు కమిటీ భావిస్తోంది. కమిటీ, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా రైతుల్ని ఏమేరకు మోటివేట్ చేయగలరు అన్నదాన్ని బట్టే ధాన్యాగారమైన గోదావరిజిల్లాల్లో రెండో పంట స్ధితీగతీ వుంటాయి. […]

  • స్కిల్ ఇండియా

    అత్యధికమైన వృత్తి నైపుణ్యాలు బిసిల చేతుల్లోనే వున్నాయి. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సానబట్టే ‘నైపుణ్యభారత్’ సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. రామస్వామి పెరియార్ సాంఘిక ఉద్యమాల ద్వారా బిసిలను కూడగట్టారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయపార్టీల్లో ప్రాబల్యం బిసిలదే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ ‘ఆదరణ’ పధకం ద్వారా బిసిల ఆర్ధిక ఉన్నతికి దోహదపడ్డారు. అది తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అయ్యింది.   నేడు 63 వ సంవత్సరంలో ప్రవేశించిన నరేంద్రమోదీ […]

  • స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు

    ఇది…కష్టాలు, ఆశలు అరణ్యరోదనగా మారినపుడు, తమ మనోభావాలకు వేదికగా వుండవలసిన ప్రజా ప్రతినిధులు దగా పూరితంగా వ్యవహరిస్తున్నపుడు, రైతులు తమ గుండెకోతను వ్యక్తం చేయడానికి మిగిలిన మార్గం…ఆత్మహత్య ఇది…వ్యక్తిగతం కాదు, వ్యవస్ధీకృతం! http://www.telugu360.com/te/no-one-worry-about-telangana-farmers-death/

  • ధర రాదు అప్పుతీరదు యూరప్ రైతులదీ అదే కథ!

    జీవన వ్యాపకాల్లో మౌలికమైన మార్పులు వచ్చినపుడు తలఎత్తే సంక్షోభాలు వ్యవస్ధాగతమైన ఆత్మహత్యలుగా మారిపోతున్నాయని ప్రపంచఅనుభవాలు రుజువు చేస్తూనే వున్నాయి. నివారణలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో ప్రభుత్వాలు విఫలమౌతూనే వున్నాయి. ఏ ఆర్ధిక సంక్లిష్టతకైనా మొదటి వేటు వేస్తున్నది వ్యవసాయరంగం మీదే! http://www.telugu360.com/te/european-farmers-demand-aid-as-produce-prices/   

  • కార్యకర్తల పునాదితోనే వారసుడికి నాయకత్వం!

    …..చంద్రబాబు నాయుడు అనుచరులుగా సహచరులుగా వున్న నాయకులు అదే విధేయతను నారా లోకేష్ పట్ల చూపించడంలో పెద్ద ఇబ్బంది వయోబేధమే! క్రమంతప్పని తెలుగుదేశం సభ్యత్వాల నమోదు కొత్తతరం కార్యకర్తల్ని పార్టీలోకి తీసుకు వస్తుంది.వీరందరికీ నిరంతరాయంగా సిద్ధాంతపరమైన శిక్షణ, ఇచ్చేలా తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపొందించింది. ఈఫలితాలు నాలుగైదేళ్ళలో లోకేష్ కు తిరుగులేని మద్దతుగా నిలుస్తాయి…. http://www.telugu360.com/te/tdp-leadership-to-nara-lokesh/   

  • ఆయనే దేవుడు…ఆయనే దెయ్యం 

    ముందే నిర్ణయించుకున్న మూసలతో రాతల్ని కొలిచే పాఠకులున్న క్షేతంలో…ఆరో వర్ధంతినాడు రాజశేఖరరెడ్డిగారిని ప్రస్తుతించడమంటే ఆయన అభిమానులతోనూ, వ్యతిరేకులతోనూ బూతులు తిట్టించుకోవడమే…నాలో పాత్రికేయ లక్షణం ఎంత మిగిలివుందో ఒక సారి చూసుకుందామని తిట్టింగుకోడానికి మిత్రుడు గోపాల్ ప్రేరణతో సిద్దమైపోయాను. వైఎస్ గురించే రాశావు చంద్రబాబు అంత పుడింగా అనే వాళ్ళకి సమాధానం ఇవ్వలేను ఎందుకంటే వాళ్ళు సమయమూ సందర్భమూ ఎరుగని మూర్ఖులు కాబట్టి …. http://www.telugu360.com/te/ysr-is-god-he-is-the-demon/      

  • అంతా ”కంటో్రల్” లోనే వుంది 

    సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటి)ని విస్తృతంగా వినియోగిస్తున్న అతిపెద్ద ఈవెంటు గోదావరి పుష్కరాలే!  ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో అధికారులు యధేచ్చగా స్మార్ట్ ఫోన్లు, టాబ్ లెట్ పిసిలు వాడుతున్నారంటే పాలనాయంతా్రంగంలో బాగా పెరిగిన ఐటి ప్రాధాన్యతని అర్ధం చేసుకోవచ్చు.  ప్రతీఘాట్ కూ ఎస్ పి హోదాగల పోలీసు ఉన్నతాధికారులను ఇన్ చార్జ్ లు గా నియమించారు. పుష్కరఘాట్లతో సహా రాజమండ్రిలో ముఖ్యకూడలులను హైస్పీడ్ కనెక్టివిటీ వున్న కెమేరాలతో అనుసంధానం చేశారు. […]

  • రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం

    రెండు రాషా్ట్రల సగటు మనిషిదీ ఒకటే హృదయం (శనివారం నవీనమ్) తన జీవితంలో ఎన్నో అంశాలను పరిశీలించి, పరిష్కరించానని, అయితే మనం దేశ,విదేశాల్లో ఎవరితో మిత్రుత్వం, శత్రుత్వం చేయాలో నిర్ణయించుకోవచ్చుగానీ, మన పక్కన వుండే వారిని నిర్ణయించుకోలేమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకున్నా…కలిసి బ్రతకాల్సిందేనని, అందరూ కలిసి దేశాభివద్ధికి దోహదం చేయాల్సిందేనని అదే చరిత్ర చెప్పిన పాఠమని నిన్న హైదరాబాద్ లో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు చంద్రబాబునాయుడు, కెసిఆర్ […]