ఆత్మకథలు, రాజకీయ చరిత్రలుఅంతగా లేని ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి సుదీర్ఘ రాజకీయ అనుభవాలు కూడా చరిత్రలో ఒక పార్శ్వమే. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో కీలక ఘట్టాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఇందులో వున్నాయి.
ఒక టెక్నాలజీ నుంచి మారిన జన జీవనశైలి అచ్చు పుస్తకాన్ని వెనక్కి పింపించింది. అయితే మరో టెక్నాలజీ మాయోమంత్రమో అన్నంత అద్భుతంగా సర్వర్లలో నిక్షిప్తమై వున్న పుస్తకాలను గాలిలోనుంచి తీసి కళ్ళముందు వుంచుతోంది. మొబైల్ గాడ్జెట్లు, స్మార్ట్ ఫోన్లు జేబుల్లోకి చేరిపోతూండటంతో ప్రేక్షకులు గా మారిన ఒకనాటి పాఠకులు, కొత్తగా రూపుదిద్దు కుంటున్న చదువరులు తిరిగి e (ఎలక్ట్రానిక్) పాఠకులుగా మారుతున్నారు.
ఎదుగుతున్న తెలుగు e పుస్తకం
సోషల్ మీడియాలో రసేవారు ఎక్కువ చదివేవారు తక్కువ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లు, టాబ్ ల విస్తృతి ఇందుకు ఒక కారణం. పాఠకులు తగ్గిపోవడం వల్ల శక్తివంతమైన సోషల్ మీడియా టైంపాస్ / నాన్ సీరియస్ మీడియాగా మిగిలిపోతోంది
ఇపుస్తకాల్లో అత్యాధికం ఇంగ్లీషువే…వాటిలో ఇండియా నేపధ్యమున్నవి బాగా తక్కువ. కినిగే .కామ్ తెలుగు ఇ బుక్స్ ప్రచురిస్తోంది. కంప్యూటర్ లాప్ టాప్ లలోఇ పుస్తకాలు చదవడం స్మార్ట్ ఫోన్లు టాబ్ లేట్ల కాలంలో కొంత అసౌకర్యమే
అన్ని భారతీయ భాషల్లో ఇపుస్తకాలు వచ్చెయ్యాలి వాటిని చదువుకోడానికి కిండల్ వైట్ పేపర్, కోబోగ్లో లాంటి రీడర్ గాడ్జెట్లు వచ్చెయ్యాలి
ఇదంతా ఎప్పటికి జరుగుతుందో ??
(ఈ ఫొటోలో వున్నది సోనీ రీడర్ ఇందులో నేనుకొనుక్కున్న దాదాపు 400 పుస్తకాలు వున్నాయి. చదువుతూంటే తరచు హాంగ్ అయిపోతూంది. కొత్తది కొందామంటే సోనీ కంపెనీ ఇ రీడర్ల తయారీని నిలిపివేసింది. ఇందువల్ల ఎప్పుడు మరణిస్తుందో తెలియని సోనీ రీడర్ నాకు చాలా చాలా అపురూపమైంది.
అన్ని రీడర్ గాడ్జెట్లనూ మింగేస్తూ వస్తున్న అమెజాన్ వాళ్ళ కిండల్ రీడర్ తెలుగుపుస్తకాలను కూడా అందులోకి అనుమతిస్తుందని, అనుమతించాలనీ నా ఆశ)
ఒకే వ్యక్తకి ఒకే డాక్టర్ 34 ఏళ్ళ వ్యవధిలో మూడుసార్లు విజయవంతంగా గుండె ఆపరేషన్ చేసిన ఉదంతం ఇది… డాక్టర్ అనుభవ నైపుణ్య సామరా్ధ్యలు, రోగి కంటిన్యువస్ ఫాలో అప్ సమన్వయంగా సాగితే హైరిస్క్ కేసుల్లో కూడా రోగి లైఫ్ క్వాలిటీని సురక్షితంగా పెంచవచ్చు అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ.
రాజమండ్రి ప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ భార్య శ్రీమతి రాజేశ్వరి కి హృద్రోగ సమస్య తలెత్తినపుడు 1980 లో మద్రాసులో డాక్టర్ చెరియన్ మొదటిసారి ఆమె ఎడమ వాల్వ్ ను సర్జరీలో రిపేరు చేశారు. తరువాత అసౌకర్యంగా వుండటంతో 1987 లో దాన్ని తొలగించి అదే డాక్డర్ సింధటిక్ (Mitral) వాల్వ్ అమర్చారు. ఇపుటు తాజాగా కొత్త కుడివాల్వు కూడా అమర్చారు.
27 ఈళ్ళ తరువాత కొంతకాలంగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వల్ల తిరిగి పరీక్షలు చేయించగా ఈ సారి కుడివాల్వు లో సమస్య ఏర్పడినట్టు గుర్తించారు.
కుడివాల్వ్ కావడంతో రిస్కు ఎక్కువనీ, ఇప్పటికే రెండు సార్లు గుండె ఆపరేషన్ జరిగివున్న నేపధ్యం వల్ల ఇది మరీ ఎక్కువనీ, మందులతో చికిత్స కొనసాగిస్తే బెటరనీ డాక్టర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాజేశ్వరికి రెండుసార్లు సర్జరీ చేసిన డబ్బై ఐదేళ్ళ డాక్డర్ చెరియన్ ఇప్పటికీ ఆపరేషన్లు చేస్తున్నారని తెలుసుకున్న కుటుంబీకులు ఆయన్ని సంప్రదించారు. గన్ని కృష్ణ తమ్ముడు జిఎస్ ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు పలుధఫాలు డాక్టర్ చెరియన్ తో సంప్రదించారు. చెన్నయ్ తీసుకువెళ్ళి పరీక్షలు చేయించారు. పాతరికార్డులను రాజేశ్వరి ఇప్పటికీ భద్రపరచి వుంచడం విశేషమని డాక్టర్ చెరియన్ ప్రశంసించారు.
శ్రీమతి రాజేశ్వరికి జనవరి 28న చెన్నయ్ లోని ఫ్రాంటియర్ లైన్ హాస్పిటల్స్ లో డాక్టర్ చెరియన్ సర్జరీ దెబ్బతిన్న కుడివాల్వు (Tricuspid) స్ధానంలో కొత్తదాన్ని అమర్చారు. ఆమె కోలుకుంటున్నారు.
‘ ఏ కేసులో అయినా లైఫ్ ఎంతముఖ్యమో, క్వాలిటీ లైఫ్ కూడా అంతే ముఖ్యం.ఆపరేషన్ చేయకుండా తలెత్తే సమస్యల రిస్క్ కీ , ఆపరేషన్ లో వున్న రిస్క్ కీ ప్రయోజనాలనూ నష్టాలనూ బేరీజు వేసే ఏది ఎక్కువ ఉపయోగం అన్నదాన్నిబట్టే నిర్ణయం తీసుకుంటామని ‘ డాక్టర్ గన్ని భాస్కరరావు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే రెండు సార్లు సర్జరీ చేసిన డాక్టర్ చెరియన్ ఇంకా యాక్టివ్ గా వుండటం పేషెంటు వద్ద రికార్డులు భద్రంగా వుండటం అరుదైన విశేషమని కూడావివరించారు
ఫొటోలో డాక్టర్ చెరియన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గన్ని కృష్ణ , ఎడమవేపు కృష్ణ కుమార్తె శ్రీమతి స్మిత కుడిచివర డాక్టర్ గన్ని భాస్కరరావు.
త్వరత్వరగా మారిపోతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో యువతరం ఎప్పుడూ ముందు ఉండలన్న ముఖయమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో చిన్నగా మొదలైన e పాలన ఊపందుకుంటోంది.
రాష్ట్ర ప్రగతికి అందరి సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు అందుబాటులో ఉండటంలో భాగంగా గూగుల్ హాంగవుట్ ద్వారా రాష్ట్ర ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. హాంగవుట్లో ఔత్సాహికులకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు. తద్వారా నూతన సాంకేతక విధానానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ- ఆఫీస్ దేశ పరిపాలనా రంగంలోనే విప్లవాత్మకమైన పరిణామానికి నాంది పలికింది. పారదర్శకతతో కూడిన సుపరిపాలనను అందించడమేగాక, ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టడానికి సాంకేతికత తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణమాఫీ , రేషన్ పంపిణీ, గ్యాస్ సరఫరా, విద్యుత్ వంటి పథకాలకు ఆధునికతను జోడించారు. ఆన్లైన్ పరిజ్ఞానాన్ని అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించింది. మరో 10 కొత్త సంక్షేమ పథకాలను ఆన్ లైన్ లో ప్రవేశ పెట్టి రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇదే విజయవంతమైతే అర్హులకే సంక్షేమ ఫలాలు దక్కడంతో పాటు అనర్హులను తేలిగ్గా ఏరివేయవచ్చు.
ఎలకా్ట్రనిక్ కార్యాలయం
ఎలకా్ట్రనిక్ కార్యాలయం అమలులో భాగంగా ఫైళ్ళ నిర్వహణను ఆన్లైన్లోనే చేపట్టనున్నారు. ఫైళ్ళ తయారీతో పాటు ప్రాసెసింగ్, డిజిటల్ సంతకం సాయంతోనే చివరికి ఫైల్‌ను ఆమోదించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఆన్లైన్లోనే నిర్వహించేలా ఈ- ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. కేవలం ఇ (ఎలకా్ట్రనిక్) మెయిల్ వినియోగం గురించి తెలిసేవారికి ఈ- ఆఫీస్‌ను వినియోగించడం చాలా తేలికని అధికారులు తెలిపారు. తొలుత 10 ప్రభుత్వ శాఖల్లో ఈ కార్యాలయాన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా ఇందులో ఉంది.
అలాగే కీలకమైన ఆర్థిక శాఖతో పాటు సంక్షేమ శాఖలైన సాంఘిక, గిరిజన, బీసీ, మైనార్టీలను ఆన్లైన్ చేశారు. న్యాయశాఖ, గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, వ్యవసాయంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ ఆన్లైన్ వ్యవస్థ అమలవుతుంది. ఆన్లైన్ కార్యాలయ వ్యవస్థలో మొత్తం ఆరు విభాగాలుంటాయి. అందులో భాగంగా ఈ-ఫైల్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, ఈ- లీవ్, ఈ- టూర్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కొలబ్రేషన్స్ అండ్ మెసెజింగ్ సర్వీసెస్ ఉంటాయి
. ఈ-ఫైల్: అన్ని ఫైళ్ళను వరుస క్రమంగా నిర్వహిస్తుంది. సంబంధిత ఉద్యోగులు, అధికారులు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ విధానం పని చేస్తుంది.
నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టం (కేఎంఎస్): నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టం అనేది కేంద్రీకృత సమాచార వ్యవస్థగా పనిచేస్తుంది.చట్టాలు, విధానాలు, మార్గదర్శకాలు వంటి ప్రతి అంశం నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టంలో పొందుపరచడం జరుగుతుంది.
సెలవు నిర్వహణ విధానం (ఈ-లీవ్): ఉద్యోగుల సెలవులకు సంబంధించిన వివరాలన్నీ దీనిలో నమోదవుతాయి. సెలవు దరఖాస్తు, మంజూరు వంటి ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరుగుతుంది.
ఎలకా్ట్రనిక్ టూర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈ- టూర్): విధి నిర్వహణలో భాగంగా సంబంధిత శాఖల్లోని అధికారులు, ఇతర సిబ్బంది ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారో ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అలాగే పర్యటన సందర్భంగా ఎదురైన విషయాలను నమోదు చేయడం జరుగుతుంది.
పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (పీఐఎంఎస్ ): ఉద్యోగుల వ్యక్తిగత వివరాలు పీ ఐ ఎం ఎస్‌లో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి నిల్వ చేస్తారు.
కొలబ్రేషన్ అండ్ మెసేజింగ్ సర్వీసెస్ (సీఎఎంఎస్): సంబంధిత శాఖలో పరస్పర సమాచారం చేరవేతకు సీ ఎఎంఎస్ సర్వీసును వినియోగిస్తారు. సందేశాల చేరవేతతో పాటు ఉద్యోగుల పే స్లిప్పులు, జీపీఎఫ్, ఇన్‌కంట్యాక్స్ వంటివన్ని ఈ- సేవల్లో ఉంటాయి.
సెంట్రలైజ్డ్ సర్వీస్: ఎలక్ట్రానిక్ కార్యాలయానికి సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటుంది. అధికారులు ఎక్కడినుంచైనా వాటిని పరిశీలించవచ్చు. అలాగే అధికార యంత్రాంగం క్షేత్రస్థాయి పర్యటనల్లో ఎవరైనా అర్హులకు మేలు చేయాలనుకుంటే అక్కడికక్కడే తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు. అనర్హులను సైతం ఎక్కడికక్కడే గుర్తించవచ్చు. సంబంధిత సమాచారం అత్యంత భద్రంగా ఉండటానికి పలు రక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అధికారులకు ప్రత్యేక కోడ్‌తో పాటు వేలిముద్రలు, కనుపాపల ఆధారాలు తీసుకున్న తర్వాతే కంప్యూటర్ తెరుచుకుంటుంది. దీనితో చిన్నపాటి తేడా కూడా వచ్చేందుకు అవకాశం లేదు. అలాగే డిజిటల్ సంతకాలు సైతం దుర్వినియోగమయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ప్రస్తుతం దాదాపు అన్ని ఫైళ్ళను కంప్యూటరీకరించారు. మరో ఏడు నెలల కాలానికి చెందిన ఫైళ్ళు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం పరిపాలనను ఈ- ఆఫీస్ద్వారానే చేయగలుగుతారు.
ఈ- ఆఫీస్ ప్రయోజనాలు: e పాలన నిస్సందేహంగా పారదర్శకతను పెంచుతుంది. ఫైళ్ళ కదలికలో రెడ్ టేపిజాన్ని అరికడుతుంది. ప్రజలు ‘కష్టమర్లయ్యే’ సందర్భాలలో లోపల ఏంజరుగుతూందో తెలుసుకోడాని వారు ఇపాలనలో ఇంటరాక్టు కావలసి వుంది అందుకు వారి డేటా సర్వర్లకు అవసరమౌతుంది. ఆధార్ కార్డే ఇందుకు ఆధారమౌతుంది. ఎలకా్ట్రనిక్ కార్యాలయంతో బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేకించి పౌరులకు వేగవంతమైన పారదర్శ కమైన సేవలు లభ్యమవుతాయి. పని సామర్థ్యం మెరుగవడంతో పాటు నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. క్లౌడ్ సర్వీస్‌తో ఉద్యోగులు ఎక్కడ్నుంచైనా పనిచేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ సంతకం వినియోగంతో ఫైళ్ళ ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదు. సంబంధిత శాఖల్లోని అధికారులు ఎన్ని గంటలు పనిచేశారో తెలుసుకోవడంతో పాటు ఎన్ని ఫైళ్ళను క్లియర్ చేశారనేది తెలుకోవచ్చు. నోట్ ఫైల్లోని అంశాలకు సంబంధించిన జీవోల ప్రతులు, ఆర్టికల్స్‌ను వాటితో పాటే అనుసంధానించగలిగితే అన్ని స్పష్టంగా చూసుకునే అవకాశం ఉంటుంది.‘గ్రామం మొదలుకుని సచివాలయం వరకూ ప్రతి దశలోనూ ‘ఈ-కార్యాలయం’ విధానాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుంది. దస్త్రాలు వేగంగా పరిష్కారమవుతాయి. ఏ అధికారైనా తన శాఖకు సంబంధించిన దస్త్రాలను ఎక్కడి నుంచైనా పరిష్కరించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం పది శాఖల్లో ఈ విధానం ప్రారంభమవ్వడం శుభపరిణమం. మిగతా శాఖల్లో కూడా వీలైనంత వేగంగా ఈ విధానాన్ని ప్రారంభించాలి. 2015 మార్చి 31కల్లా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ‘ఈ-కార్యాలయం’ విధానాన్ని అమలు చేసి దేశంలోనే తొలి ‘ఈ-సచివాలయం’గా ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి గుర్తింపు తీసుకురావాలన్న చంద్రబాబు ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిద్దాం.
e(ఎలకా్ట్రనిక్) పాలనలో ప్రజలు తెలుసుకోవలసిన సమాచారానికి # (హాష్ టాగ్) ని కూడా జోడిస్తే నాలాంటి వయసుమళ్ళిన వారి వల్ల కాదేమోగాని ఇంటర్ నెట్ పరిజ్ఞానమున్న వారు టాబ్లెట్ పిసిలు, ఫోబ్లెట్లు, స్మార్ట్ ఫోన్ లలో కూడా గవర్నమెంటుని చూడవచ్చు, అర్ధంచేసుకోవచ్చు, నిలదీయవచ్చు.
సుప్రసిద్ధ సర్జన్, జి ఎస్ ఎల్ మెడికల్ కాలేజి మెంటార్, రాజమండ్రి పౌరప్రముఖుడు
డాక్టర్ గన్ని భాస్కరరావు వైద్యరంగంలో నిబద్ధతా, నైపుణ్యాలపై ‘లైఫ్ టైమ్ ఎచీవ్ మెంటు’ అవార్డు అందుకున్నారు.
అహ్మదాబాద్ లో డిసెంబరు 27 న జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 89 వ నేషనల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ గన్ని కి ఈ అవార్డుని అందజేశారు.
ఐఎంఎ నేషనల్ ప్రసిడెంట్ డాక్టర్ జితేంద్ర పటేల్, కేంద్ర వైద్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్, గుజరాత్ వైద్య మంత్రి నితిన్ భాయ్ పటేల్, ఎంసిఐ చైర్మన్ డాక్టర్ జయశ్రీ మెహతా, కేతన్ దేశాయ్ మొదలైన మెంబర్లు, దేశవ్యాప్తంగా వైద్యరంగం ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘ఎంకి ఎవ్వరంటే ఎలుగు నీడల వైపు వేలు సూపింతు’ అంటాడు నాయుడు బావ.
‘ఎంకి ఎవ్వరంటే ఎలుగు నీడల వైపు వేలు సూపింతు’ అంటాడు నాయుడు బావ. అలాంటి వెలుగు నీడలు, రాత్రీ పగలు ఒకే ఫ్రేములో కనబడుతున్న ఈ అపురూప దృశ్యాన్ని అంతరిక్షం నుంచి ‘కొలంబియా’ ఫొటో తీసింది. యూరప్ – ఆఫ్రికా ల మధ్య ఒక్క మేఘమూ లేని నిర్మలాకాశం లో సూర్యుడు అస్తమిస్తున్న(?) ఈ సన్నివేశంలో యూరప్ నిద్రపోతూండగా ఆఫ్రికా మేల్కొంటూ వుండటాన్ని చూడవచ్చు. ఎడమవైపు కనబడుతున్నది అట్లాంటిక్ మహాసముద్రం. కుడి వైపు చీకటిగా వున్నది యూరప్. దాని దిగువ తెల్లగా కనిపిస్తున్నది ఆఫ్రికా. దీపాలు వెలుగుతున్న యూరప్ లో హాలెండ్, పారిస్, బార్సిలోనా నిద్రపోతున్నాయి. అదే యూరప్ లోని డబ్లిన్, లండన్, లిస్టన్, మాడ్రిడ్ లలో ఇంకా చీకటి పడలేదు. ఆఫ్రికాలోని సహారా ఎడారిలో పగలూ రాత్రీ కనబడుతున్న ఈ సన్నివేశాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది శాస్త్రవిఙ్ఞానానికీ, సాంకేతిక పరిఙ్ఞానానికీ మనిషెత్తు సాక్ష్యం
Recent Comments