-
మోదీ – బాబు ఎదురీత!
ప్రస్తుతానికి మనకి పనికిరాని ఈ అభివృద్ది మోడల్ ని వదిలేసి ఆర్ ఎస్ ఎస్ సూచించినట్టు భారతీయ నమూనా ను సిద్ధం చేసుకోవడమే ఉత్తమం…కాని పక్షంలో ”సస్టెయిన్ బుల్ మేక్ ఇన్ ఇండియా” దాదాపు అసాధ్యమే!
-
గోదావరిలో నీటి ఎద్దడి
గోదావరి డెల్టాలో రెండో పంటకు నీటి ఎద్దడి పదమూడేళ్ళనాటి తీవ్రతకు మించి వుండగలదని ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇది కనీసం మూడువేల కోట్లరూపాయల వ్యవసాయిక ఆర్ధిక వ్యవస్ధను ప్రభావితం చేస్తుంది. అయితే తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడులు సాధించి చరిత్రను తిరగ రాయాలని రైతులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాజెక్టు కమిటీ భావిస్తోంది. కమిటీ, ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా రైతుల్ని ఏమేరకు మోటివేట్ చేయగలరు అన్నదాన్ని బట్టే ధాన్యాగారమైన గోదావరిజిల్లాల్లో రెండో పంట స్ధితీగతీ వుంటాయి. […]
-
వెన్నల కాలం
శీతోష్ణాల సమస్ధితి వల్ల శరీరానికి అలసటలేదు. పెద్దగా మెడికేషన్ లేకపోయినా వారంలోనే వైరల్ ఫీవర్ తగ్గడానికి క్లయిమేటే కారణం అనిపిస్తోంది. ఏమైతేనేమి హైదరాబాద్ లో వారంరోజులు వృధాపోయాయి. అసలే చెమట పట్టని హైదరాబాద్…ఆపై వేడితక్కువ వెన్నెల ఎక్కువ అయిన శరదృతువు. ఆకులు రాలేదీ, రంగురంగుల డిజైన్ల శీతాకోక చిలుకలు గుంపులు గుంపులు గా సంచరించే కాలం వచ్చేసింది. రాజమండ్రిలో మాదిరిగానే నిజాంపేటలో కూడా నా ఇంటికి 350 మీటర్ల దూరంలోనే పార్కు వుంది. అది పచ్చటి రౌండ్ […]
-
కల్చరల్ పోలీసింగ్ పై ఆవేదన అవార్డుల వాపసుతో రచయితల నిరసన
మతద్వేషం, ప్రశ్నించే వారిపై దాడులూ, ఆందొళనకరంగా పెరిగిపోతున్న ”కల్చరల్ పోలీసింగ్” పై రచయితల అవేదనకు, నిరసనకూ ఉన్నత స్ధాయి నుంచే స్పందన రావాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలి…దురదృష్టకరం…మాకు సంబంధంలేదు వంటి పొడిపొడి ఖండనలు కాకుండా ఆవేదనకు ఉపశమనం కలిగించాలి. http://www.telugu360.com/te/writters-refunding-govt-awards-in-protest/
-
హుదూద్’ ఇళ్ళు కట్టలేదు సరే! 260 కోట్ల విరాళాలు ఏమయ్యాయి మరి?
ఉత్తరాంధ్ర, విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన ప్రచండ తుపాను ‘హుదూద్’ ప్రాంతాల పునర్నిర్మాణం మొదలుకాలేదు. బాధితుల సహాయ, పునరావాసాలపై ప్రభుత్వం హామీలు నెరవేరలేదు. ఒక్క పటిష్ట, శాశ్వత చర్య కూడా లేదు.తుపానుకి చితికపోయిన విశాఖ మురికివాడలను, మత్స్యకార ప్రాంతాలను చూస్తే ప్రచారంలోని డొల్లతనం ప్రత్యక్షమౌతుంది. http://www.telugu360.com/te/no-rehabilitation-even-after-1-year-hudhud/
-
హోదా పై మాయమాటలు వొద్దు !
హోదా” సంజీవనీ మంత్రం కాదని వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతూవుండి వుండవచ్చు. ”పెద్దకొడుకునై ఆంధ్రప్రదేశ్ కష్టం తీరుస్తా” అని తిరుపతి సభలో నమ్మబలికి అధికారం ఎక్కాక మూగనోము పట్టిన నరేంద్రమోదీ నమ్మకం కూడా అదే అయివుండవచ్చు. కానీ, ప్రత్యేక హోదా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించగలదని విద్యావంతులు, ఆలోచనాపరులు, మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని తటస్ధవాదులు నమ్ముతున్నారు. వైఎస్ జగన్ మోహన రెడ్డిని వ్యతిరేకించే వారు కూడా ఆయన నిరాహార దీక్షను శ్రద్ధాసక్తులతో పరిశీలిస్తూ వుండటమే […]
-
షరతుల నుంచి జోక్యం వరకూ…
అప్పు ఇచ్చేవాళ్ళు షరతులు పెట్టడం అసంబద్ధమేమీకాదు. అదేసమయంలో బయటి వ్యవస్ధల జోక్యం మన స్వతంత్రతకు, రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి భంగకరంకూడా. కేంద్రంలో,రాష్ట్రాల్లో ఏ పార్టీవారు అధికారంలో వున్నా ప్రపంచబ్యాంకు షరతులగురించి దాచిపెట్టి జనసంక్షేమానికి కఠిన నిర్ణయాలు తప్పవని ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రపంచబ్యాంకు లేదా అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల షరతులప్రకారమే తాము పధకాలు అమలు చేస్తున్నామని పారదర్శకంగా చెప్పిన ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రిగాని ఒక్కరూలేరు. http://www.telugu360.com/te/world-bank-suggestions-to-indian-states/
-
మూడేళ్ళకు మళ్ళీ కీచురాళ్ళ సంగీతం !
మబ్బులు తేలిపోయాయి. నిర్మలాకాశంలో సగం చంద్రుడు. ముసురు వెలిశాక వుండే చల్లదనం…గాలి ఆడని ఉక్కపొత…శరీరాన్ని కొంత సౌకర్యంగా కొంత అసౌకర్యంగా వుంచుతున్నట్టు వుంది. అన్నిటికీ మించి కీచురాళ్ళు సంగీతం, కీటకాల రొద మూడు సీజన్ల తరువాత ఇప్పుడే రౌండ్ పార్కలో వినిపించింది…మీ ఊళ్ళో కప్పల మేళం వినబడుతూందా అని సెల్లార్ లో తారసపడిన శ్రీరామపురం నుంచి వచ్చిన పాల అబ్బాయిని అడిగితే ఇంకెక్కడి కప్పలు చైనా ఎక్స్ పోర్ట్ అంటగా అనేశాడు. ముందుటేడాదే వానల్లో కప్పలగోల వినబడింది. […]
-
అమెరికా నమ్మదగిన నేస్తమేనా
పెత్తనం చేయాలన్న కాంక్ష, ఎదిరించాలన్న దీక్ష…ఈ రెండే ఆధునిక చరిత్రలో అగ్రరాజ్యాలలో అందునా అమెరికా అనుకూల, వ్యతిరేక ప్రపంచాన్ని విభజించేశాయి. వృద్ధి చెందుతున్న దేశాల సహజశక్తులూ, మెరుగులు దిద్దుకుంటున్న నైపుణ్యాలూ, ‘పెద్దన్నల’ వాణిజ్య సైనిక పెత్తానాలను నిలువరించే దశకు పదునెక్కుతున్నాయి. వాస్తవాలను అర్ధంచేసుకోవడం వల్లో మరో మార్గలేకపోవడం వల్లో ఆధిక్యత చెలాయించే ధోరణి నుంచి ఇచ్చిపుచ్చుకునే పంధాలోకి మారిందంటున్న నేపధ్యంలో కూడా భారతదేశానికి అమెరికా నమ్మదగిన నేస్తమేనా అన్న ప్రశ్న చర్చకు వస్తూనే వుంటుంది. http://www.telugu360.com/te/is-united-states-reliable-friend-to-india/
-
ఆదిలోనే హంసపాదు
ఏడాదిలోకావలసిన పనులను ఆరునెలలలోనే గొంతు మీద కూర్చుని పూర్తి చేయించిన అనర్ధమే ఇదని జలవనరులశాఖలో సిబ్బందిని ఎవరిని కదిలించినా తిట్టుకుంటున్నారు http://www.telugu360.com/te/river-interlinking-aqueduct-breaches-within-hours-of-launch/