అప్పు ఇచ్చేవాళ్ళు షరతులు పెట్టడం అసంబద్ధమేమీకాదు. అదేసమయంలో బయటి వ్యవస్ధల జోక్యం మన స్వతంత్రతకు, రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి భంగకరంకూడా. కేంద్రంలో,రాష్ట్రాల్లో ఏ పార్టీవారు అధికారంలో వున్నా ప్రపంచబ్యాంకు షరతులగురించి దాచిపెట్టి జనసంక్షేమానికి కఠిన నిర్ణయాలు తప్పవని ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రపంచబ్యాంకు లేదా అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల షరతులప్రకారమే తాము పధకాలు అమలు చేస్తున్నామని పారదర్శకంగా చెప్పిన ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రిగాని ఒక్కరూలేరు.
http://www.telugu360.com/te/world-bank-suggestions-to-indian-states/
అమెరికా నమ్మదగిన నేస్తమేనా
పెత్తనం చేయాలన్న కాంక్ష, ఎదిరించాలన్న దీక్ష…ఈ రెండే ఆధునిక చరిత్రలో అగ్రరాజ్యాలలో అందునా అమెరికా అనుకూల, వ్యతిరేక ప్రపంచాన్ని విభజించేశాయి. వృద్ధి చెందుతున్న దేశాల సహజశక్తులూ, మెరుగులు దిద్దుకుంటున్న నైపుణ్యాలూ, ‘పెద్దన్నల’ వాణిజ్య సైనిక పెత్తానాలను నిలువరించే దశకు పదునెక్కుతున్నాయి. వాస్తవాలను అర్ధంచేసుకోవడం వల్లో మరో మార్గలేకపోవడం వల్లో ఆధిక్యత చెలాయించే ధోరణి నుంచి ఇచ్చిపుచ్చుకునే పంధాలోకి మారిందంటున్న నేపధ్యంలో కూడా భారతదేశానికి అమెరికా నమ్మదగిన నేస్తమేనా అన్న ప్రశ్న చర్చకు వస్తూనే వుంటుంది.
పండగంటే!!!
గత్యంతరం ఒకటుంటుందన్న స్పృహ కూడా లేకుండా జీవన గమనాలు గంతలు కట్టుకున్న చూపుల వెంట అలవాటైపోయిన సర్కస్ నడకలా సునాయాసంగానే గమ్యం చేరుకుంటూనే వుంటాయి. తండ్రివో, తల్లివో, కూతురివో, కొడుకువో, పనివాడివో, యజమానివో, దొరవో, వెధవవో…ఎవరివైనా సరే ఒక ఆర్బిట్ లో ప్రవేశించాక ఏ కక్ష్యలో పరిభ్రమణం వారిదే.
ఈ ప్రయాణంలో విసుగునీ, భారాన్నీ, విరక్తినీ తొలగించడానికో ఏమో,
– ప్రయాసపడి భారాన్ని మోసేవారందరికీ ద్వారాన్నీ మార్గాన్నీ తానేనని దైవకుమారుడు ఇచ్చిన భరోసా…
– సర్వశక్తిమంతుడైన దైవం ఒక్కడే, మరే ఆరాధన అయినా అవిశ్వాసమే అన్న ప్రవక్త కనువిప్పూ…
– సర్వ సంశయాలూ విడిచి పెట్టి తననే శరణుకోరమని గీతాకారుడు ఇచ్చిన అండా…
మనిషి ఇచ్ఛను దేవుడి అధీనం చేయడానికి దారులు వేశాయి.
ఇందుకు ప్రలోభంగా లభించే మనసు ప్రశాంతతా, వేడుక వాతావరణమూ పండగే! పండగే!!
కుడుములు లంచమిచ్చి, పనిముట్లు పూజలోపెట్టి ,కోర్కెలు తీర్చమనే వేడికోలు ఇంటిల్లపాదికీ సంబరమే!!
స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు
ఇది…కష్టాలు, ఆశలు అరణ్యరోదనగా మారినపుడు, తమ మనోభావాలకు వేదికగా వుండవలసిన ప్రజా ప్రతినిధులు దగా పూరితంగా వ్యవహరిస్తున్నపుడు, రైతులు తమ గుండెకోతను వ్యక్తం చేయడానికి మిగిలిన మార్గం…ఆత్మహత్య
ఇది…వ్యక్తిగతం కాదు, వ్యవస్ధీకృతం!
స్పందనా రాహిత్యమే జాతీయ విధానం ఎవరికీ పట్టని రైతు ఆత్మహత్యలు
ఎర్ర గౌరవం!
ఇపుడున్న ప్రపంచం అన్యామైనదని, దాన్ని మరమ్మతు చేయాలని నమ్మి, ఎంతో కొంత ప్రయత్నం చేసే కమ్యూనిస్టు పార్టీ లంటే నాకు గౌరవం. సర్వభ్రష్టత్వాన్ని సాధించి గౌరవాభిమానాలకు కమ్యూనిస్టేతర పార్టీలు అర్హతలు కోల్పోయిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలవైపు ఒక మినహాయింపుతో కొంత ఆశగా చూసే జనంలో నేనూ ఒకడిని. ఇన్ని ఎన్నికల్లో వామపక్షాలకు ఓటు వేసే అవకాశం నాకు రెండేసార్లు దొరికింది.
జనతా పరివార్, మార్పుకు నమ్మదగ్గ ప్రతినిధేనా?
జనతా పరివార్, మార్పుకు నమ్మదగ్గ ప్రతినిధేనా?
(శనివారం నవీనమ్)
పునరావృతం కాదు కాని ఒకే విధమైన పరిణామాలముందు చరిత్ర తనను తాను అనుకరించుకుంటుంది. అదే వరుస, అవే పరిణామాలే పూర్వరంగమైనా పర్యావసానాలు మాత్రం వేరుగా వుంటాయి. కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకున్న స్ధితిలో, పార్టీ బయటా వెలుపలా ఏకపక్ష నియంతృత్వ పోకడలవల్లా, అదుపులేని కార్పొరేట్ మోజువల్ల, వాగ్దాన ఉల్లంఘనలవల్లా, సాధ్వులు, బాబాల మతచాందస కురుపుల వల్లా బిజెపి పదినెలలకే ఆత్మరక్షణ దిశగా అడుగులు వేస్తున్న నేపధ్యంలో జనహృదయాన్ని స్పృశించగలిగిన వివేకాన్నీ వ్యూహాన్నీ అనుసరించగలిగే పక్షాలదే రేపటి విజయమౌతుంది.
కనీసం అధికార పక్షాన్ని నిలదీసే జనం గొడుగౌతుంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఒడిసా, తమిళనాడు, పశ్చిమబంగాల్, తెలంగాణ దేశవ్యాప్తంగా మినహా మోడీ ప్రభంజనం వీచిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతల్లో ఒక విధమైన అభద్రతా భావం తలెత్తింది. తమ రాజకీయ భవిష్యత్తుపై వారికి ఆందోళన కలిగింది. ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా బిజెపికి అనుకూలంగా రావడంతో మోడీ పదేళ్లపాటు ఢిల్లీ పీఠం వదలరని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితం మోడీ వ్యతిరేకులకు కొంత ఊరటనిచ్చింది.
అయితే రాజకీయంగా బలపడేందుకు తరుణోపాయం ఆలోచించాల్సిన అవసరం మాత్రం అలానే ఉంది. వీటన్నింటికి తోడు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఇప్పటిలో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ఆరు పార్టీలు పునరాలోచనలో పడి ఒకటైనాయి. జనతా పరివార్ పార్టీలన్నీ కలిసి సమాజ్‌వాదీ జనతా పార్టీగా ఆవిర్భవించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సారథ్యంలో ఆరు పార్టీలతో కూడిన జనతా పరివార్ త్వరలో జరగనున్న వివిధ రాషా్టల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.
బీహార్‌లో బలమైన నాయకుడైన నితిష్‌కుమార్, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, హర్యానా, కర్నాటక రాషా్టల్ల్రో క్యాడర్ ఉన్న వివిధ జనతా పరివార్ పార్టీలు ఒక గుర్తుతో పోటీ చేస్తే మంచిఫలితం ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ఏడాదే బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అందువల్లే అటు కాంగ్రెస్, ఇటు బీజేపి కూడా జనతా పరివార్ పార్టీలు కలుస్తాయా లేదా అనే అంశంపై వేచి చూశాయి. చివరకు జనతా పరివార్ ఒక్కటైంది.
ములాయం సింగ్ యాదవ్ ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి బీహార్ ముఖ్య మంత్రి నితీష్‌కుమార్, జెడియు చీఫ్ శరద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి, జెడిఎస్ చీఫ్, మాజీ ప్రధాని దేవేగౌడ, ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ జనతా పార్టీ చీఫ్ కమల్ మొరార్‌క, ఐఎన్‌ఎల్‌డి నేత దుశ్యంత్ చౌతాలాలతోపాటు ములాయం సోదరుడు రామ్‌గోపాల్ యాదవ్ హాజరయ్యారు. జనతా పరివార్ మహా కూటమి ఏర్పాటులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన చూపిన చొరవ వల్లే ఈ కూటమి సాకారమైంది. ములాయం, లాలూల మధ్య ఇటీవల కుదిరిన బంధుత్వం కూడా ఇందుకు బాటలు వేసింది. నితీష్‌కుమార్ ఈ పార్టీకి నేతృత్వం వహించేందుకు ఏనాడూ ఆసక్తి చూపలేదు. ఆది నుంచి ములాయం సింగ్ అయితేనే ఈ కూటమి నిలుస్తుందని నితీష్‌కుమార్ వాదిస్తూ వచ్చారు. ఇందుకు లలూ ప్రసాద్ యాదవ్‌ను ఒప్పంచారు. జనతా పరివార్ కూటమికి సంబంధించి ఆరు పార్టీల నాయకులు పలుదఫాలుగా విలీనంపై చర్చించుకున్నారు. ఓ అభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల గుర్తుపై చర్చించిన తరవాత ఓ నిర్ణయానికి రావచ్చని, బహుశా సైకిల్ గుర్తు ఖరారు కావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నెల 5న ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ నినాదం ఇచ్చారు. ఏక్ జండా..ఏక్ నిషాన్ అని. జనతా పరివార్ ఏర్పాటయితే బీహార్‌లో బిజెపిని నామమాత్రం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సారథ్యంలో ఆరు పార్టీల పరివార్ పనిచేస్తుందని లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే తెలిపారు. విలీనమంటే విలీనమే అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు అని ఆర్‌జెడి అధినేత స్పష్టం చేశారు. పార్టీ గుర్తుపైనే స్పష్టత లేదుతప్ప మిగతా అన్నింటిలోనూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన అన్నారు. లౌకికవాద పార్టీలతోనూ కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని లాలూ పేర్కొన్నారు.
సమాజ్‌వాది, ఆర్జేడీ, జేడీయూ, జేడీఎస్, ఐఎన్‌ఎల్డీ, ఎస్‌జేపీ పార్టీలన్నీ కూడా ఒక నాటి జనతా పార్టీలోని భాగాలే. భారతీయ జనతా పార్టీ కూడా ఆ తానులో ముక్కే కానీ సిద్ధాంత ప్రాతిపదికన పూర్తిగా వేరైపోయిన సందర్భం అది. ఒకప్పుడు ఈ అన్ని పార్టీల్లోకెల్లా చిన్న పార్టీ బిజెపి. అయితే కేంద్రంలో 24 సంవత్సరాల తర్వాత సాధారణ మెజారిటీ సాధించిన ఏకైక పార్టీ స్థాయికి బిజెపి చేరుకుంది.
అప్రతిహతంగా సాగుతున్న బిజెపికి అడ్డుతగలాలంటే తమ స్వార్ధం కొంత వదులుకోవాలని పూర్వపు జనతా పార్టీ విభాగాలు అనుకున్నాయి. అనుకున్నదే తడవుగా పావులు కదిపి ఈ స్థాయికి చేరుకున్నాయి. మతతత్వ శక్తులను ఓడించడానికే ఆరు పార్టీలు విలీనం అయినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. బీహార్ ఎన్నికల్లో జనతా పరివార్ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉండటమే తమ లక్ష్యమని లాలూ చెప్పడం రాజకీయ మార్పునకు నాందిపలుకుతున్నది.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేని నేపధ్యంలో భవిష్యత్తులో వామపక్షాలు కూడా ఈ పరివార్‌తో చేరవచ్చు. ఈ కూటమిలో వామపక్షాలు కూడా కలిస్తే మిగిలిన రాషా్టల్రలోని జనతా పార్టీయేతర పార్టీలు మరి కొన్ని కూడా ఈ పార్టీతో కలవడానికి ఉత్సాహం చూపించవచ్చు. అదే జరిగితే బిజెపికి కొన్ని రాషా్టల్ల్రో మంచి ఫలితాలు సాధించడం కష్టసాధ్యమౌతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తే ఆ తర్వాత వచ్చే నాలుగు రాషా్టల్ర (తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికలు, ఆ మరుసటి ఏడాది వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. ఇవి ముగిసిన తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు బిజెపిని సవాల్ చేసే స్థాయికి వస్తుంది.
ఈ లోపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏవైనా తప్పులు చేస్తే ఎత్తి చూపేందుకు కూడా ఈ కొత్త పార్టీ ఉత్సాహం చూపిస్తుందనడంలో సందేహం లేదు. అందువల్ల సమస్యలు వచ్చేది బిజెపికే!
మార్పుకు నమ్మదగ్గ ప్రతినిధి కావాలి! జనతా పరివార్ అలాంటి ప్రాతినిధ్యం వహించగలదా???