మోదీ ఎఫ్ డి ఐ దూకుడుపై – స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం!


26 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలన్న ప్రజాస్వామిక ధర్మాన్ని, కనీసం కేబినెట్ సహచరులతో చర్చించాలన్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి విదేశీ కార్పొరేట్ల ను సంతోషపరడానికి రాత్రికి రాత్రే ఎఫ్ డి ఐ అనుమతులపై ఉత్తర్వులు జారీ చేయించిన మోదీ దూకుడుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్ధ ఎస్ జె ఎం కూడా ఎఫ్ డి ఐ ల పై అభ్యంతరాన్ని ప్రకటించింది…
    

మోదీ – బాబు ఎదురీత!


ప్రస్తుతానికి మనకి పనికిరాని ఈ అభివృద్ది మోడల్ ని వదిలేసి ఆర్ ఎస్ ఎస్ సూచించినట్టు భారతీయ నమూనా ను సిద్ధం చేసుకోవడమే ఉత్తమం…కాని పక్షంలో ”సస్టెయిన్ బుల్ మేక్ ఇన్ ఇండియా” దాదాపు అసాధ్యమే!
  

అమెరికా నమ్మదగిన నేస్తమేనా


పెత్తనం చేయాలన్న కాంక్ష, ఎదిరించాలన్న దీక్ష…ఈ రెండే ఆధునిక చరిత్రలో అగ్రరాజ్యాలలో అందునా అమెరికా అనుకూల, వ్యతిరేక ప్రపంచాన్ని విభజించేశాయి. వృద్ధి చెందుతున్న దేశాల సహజశక్తులూ, మెరుగులు దిద్దుకుంటున్న నైపుణ్యాలూ, ‘పెద్దన్నల’ వాణిజ్య సైనిక పెత్తానాలను నిలువరించే దశకు పదునెక్కుతున్నాయి. వాస్తవాలను అర్ధంచేసుకోవడం వల్లో మరో మార్గలేకపోవడం వల్లో ఆధిక్యత చెలాయించే ధోరణి నుంచి ఇచ్చిపుచ్చుకునే పంధాలోకి మారిందంటున్న నేపధ్యంలో కూడా భారతదేశానికి అమెరికా నమ్మదగిన నేస్తమేనా అన్న ప్రశ్న చర్చకు వస్తూనే వుంటుంది. 

భారత్ కు అమెరికా నమ్మదగిన ఫ్రెండేనా?


  

స్కిల్ ఇండియా


అత్యధికమైన వృత్తి నైపుణ్యాలు బిసిల చేతుల్లోనే వున్నాయి. వాటికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సానబట్టే ‘నైపుణ్యభారత్’ సోషల్ ట్రాన్స్ ఫర్మేషన్ ని తీసుకువస్తుంది. రామస్వామి పెరియార్ సాంఘిక ఉద్యమాల ద్వారా బిసిలను కూడగట్టారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయపార్టీల్లో ప్రాబల్యం బిసిలదే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ టి ఆర్ ‘ఆదరణ’ పధకం ద్వారా బిసిల ఆర్ధిక ఉన్నతికి దోహదపడ్డారు. అది తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకు అయ్యింది.  
నేడు 63 వ సంవత్సరంలో ప్రవేశించిన నరేంద్రమోదీ ‘స్కిల్ ఇండియా’ దేశవ్యాప్తంగా బిసి ఎంపవర్ మెంటుకి బాటవేస్తుంది.
http://www.telugu360.com/te/india-to-lead-transformation/ 
  

చైనా మాంద్యంలో ఇండియా లాభాలు! 


పెట్టుబడులను ఆహ్వానించడానికి భారత్ నాయకులు చైనా వెళ్ళడం అవసరం…మౌలిక వసతుల కల్పనకు మితి మీరి ఖర్చు చేయడమే చైనా ఆర్ధిక సంక్షోభానికి మూలమని నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు గ్రహించడం కూడా మన ప్రయోజనాలకు అత్యవసరం.

http://www.telugu360.com/te/surat-diamond-blow-to-china-even-more-benefits-to-india/ 

  

ఇది గౌరవభంగం కూడా…


పార్లమెంటులో ప్రశ్నించడానికీ, ప్రభుత్వంలో ప్రస్తావించడానికీ వీలులేకుండా ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం దయాదాక్షిణ్యాల ఫైలు లో విభజన హక్కుల్ని కుడా కూరేసి చంద్రబాబు చూస్తూండగానే ప్రధాని చైర్మన్ గా వున్న నీతిఆయోగ్ కాళ్ళకిందికి తోసేశారు…..

http://www.telugu360.com/te/ap-right-is-now-at-neethi-ayoogs-mercy/ 

 

కుదురులేని మనసు 


ప్రధానమంత్రి వ్యవస్ధమీద నాకు ఇప్పటికీ గౌరవం వుంది. నరేంద్రమోదీ గారి మీద ఎన్నో ఆశలు వుండేవి. రంగులతలపాగాలో ఆయన భారతీయత, ఆయన చేతులూపుతూ చేసే ప్రసంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు పట్ల కమిట్ మెంటు కనబడేది. 

ఆయనలోని వ్యాపార వర్గాల అనుకూలత ప్రజలకు ఉపయోగపడేదికాక, ఇబ్బంది పెట్టేది మాత్రమేనని ఏడాది అనుభవంతో అర్ధం చేసుకున్నాను. ఇది అర్ధమయ్యాక, (ప్రత్యేక హోదా పై ఆయన మోసం చేయడం వల్లకూడానేమో)…
ఇవాళ ఎర్రకోటలో అదే మోదీ, అదే తలపాగా, అవే చేతులు ఊపడం చూస్తూంటే 

ఎవరో సుప్రసిద్ధ ఇంద్రజాలకుడి మేజిక్ షో చూస్తున్నట్టు అనిపించింది. ఆయన కొత్తగా నినదించిన ‘టీమ్ ఇండియా’ ఏమాత్రం ఉత్తేజపరచలేకపోయింది. 

వెరీ వెరీ సారీ! 
శక్తి హీనుడైపోయిన చివరి మొఘలాయీ చక్రవర్తి కూడా అనేకసార్లు అడిగించుకుని కాని ఈస్టిండియా కంపెనీవాళ్ళ వ్యాపారానికి ఈ నేలమేద అధికారాన్ని ఇవ్వలేదు. అలా వేళ్ళూనుకున్న ఆంగ్లేయులను సాగనంపడానికి మన పూర్వీకులు మూడువందల ఏళ్ళు పాటు పడ్డాక హమ్మయ్య అనుకున్న 69 ఏళ్ళకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులూ పోటీలుపడి విదేశీకంపెనీలను ఆహ్వానించేస్తున్నారు. 
వ్యాపారఒప్పందాల్లో ప్రజలప్రయోజనమెంత?కార్పొరేట్ల లాభమెంత? ఈరెండింటికీ మధ్య హద్దుల్ని కట్టడి చేసేదెవరు? మొదలైన అంశాల్ని నరేంద్రమోదీ, చంద్రబాబు సహా ఏ ప్రభుత్వాలూ పారదర్శకంగా వుంచకపోవడం వల్ల మనపేదరికాన్ని దేశ,విదేశీ పెట్టుబడులకోసం అడ్డంగా తాకట్టుపెట్టేస్తున్నారనిపిస్తోంది. 
స్వేచ్ఛా స్వాతంత్రాలను ఐచ్ఛికంగా తాకట్టుపెట్టేస్తున్న నాయకులధోరణి కష్టంగా వుంది. అందుకని జెండాపండుగకు వెళ్ళకుండా ఇంట్లోనే వుండిపోయాను. ఒళ్ళుబాగోలేక ఒకసారి, మనసుబాగోలేక ఈవేళ మినహాయించి నేను జెండాపండగ చేసుకోని సంవత్సరమేలేదు. – జైహింద్ 

వృద్ధికి కేంద్రం – జీవితమా ? డబ్బా?


”గడవడమే కష్టంగా వుంది” అంది ఒక యువతి 

”డబ్బుసమస్య ఎవరికి లేదని, ఏదైనా ఆర్డర్ వస్తే పూర్తిచేసి ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలీదు. అందాకా ఈడబ్బుతోనే సర్దికోవాలి”అని ఓ నలభైఏళ్ళ సీ్త్ర తన పర్సుని ఆయువతికి ఇచ్చింది. 
అందులో ఒక ఇరవై నోటు ఒక పదినోటు కాస్త చిల్లర చూసి ”నువ్వేనయం 

దేవుడి దగ్గర వెలిగించచానికి అగరుబత్తీ లేదు. రేపు తలస్నానానికి షాంపూ పేకెట్ లేదు. కొనడానికి డబ్బులు లేవు” అంది ఆ యువతి.
”ఉన్నదే సర్దుకుని తింటున్నాం. ఎప్పుడు ఏ అవసరం విరుచుకుపోతుందనే భయమే తప్ప బాగానే వున్నాము. అదేజీతం ఇదివరకు చివరి వారమే డబ్బులుండేవికాదు. ఇపుడు వారం పదిరోజుల తరువాత డబ్బు వుండటం లేదు” అని యువతి చెప్పుకొస్తోంది. డబ్బు ఇబ్బందే తప్ప ఎంతబాగా చూసుకుంటాడో అని మురిపెంగా చెబుతోంది. 
ఏదైనా జాబ్ చూడకపోయావా అంది ఆస్త్రీ 

నీలాంటి ముసలోళ్ళకే బయటికి వెళ్ళి పనిచేయడం సమస్య నేను వెళ్ళనే వెళ్ళను అనేసింది యువతి. 
ఇద్దరూ గట్టిగా నవ్వేసుకుని చేతులు పట్టుకుని కబుర్లాడుకుంటూ సంతోషాల్ని కలబోసుకున్నారు. ఒక అగరుబత్తీని ఎన్ని ముక్కలు చేస్తే అన్నిరోజులు దేవుడిముందు వెలిగించవచ్చిని ఆమె చిట్కా చెప్పగానే 

కదా అంటూ భలే డిస్కవరీ అన్నట్టు సంబరపడిపోయింది ఆయువతి. 
ఈసాయంత్రం ఇద్దరి మధ్య (ఖచ్చితంగా ఈ మాటలే కాదుకాని ఇంచమించు)ఈ సంభాషణల్నే విన్నాను. 
డబ్బులేదన్న ఆందోళన తప్ప జీవితం ప్రేమాస్పదం అనే ఎమోషన్ యువతిలో, సమస్యల్ని హాండిల్ చేసే నిబ్బరాన్ని సాధించిన సీ్త్రలో …పాజిటివ్ యాటిట్యూడ్ అద్భుతంగా కనిపించింది. వారు జీవితమే కేంద్రంగా బతుకుని వారు స్వీకరించి ఆస్వాదిస్తున్నారు. నాలాంటి లక్షలు కోట్లమంది డబ్బే కేంద్రంగా తృప్తి లేని బతుకును ఈడ్చేస్తున్నాము.
ఆ ఇద్దరూ ఆకస్మికంగా రెండు చీపురుకట్టలై పోయినట్టు భ్రమ కలిగింది. ధరలు అదుపుచేయలేక, సాంఘిక భద్రత ఇవ్వలేక, కష్టపడి జీవించే అడుగు మనిషికి ప్రశాంతతనూ, గౌరవాన్నీ హరించేసి కార్పొరేట్ ఊడిగపు వెర్రిలో మైమరచిపోతున్న పాలకులను చీపురుకట్టలు కోపంగా చూస్తున్నట్టు భ్రాంతి కలిగింది. డిల్లీనుంచీ అమరావతినుంచి దిగబడే స్మార్ట్ సిటిల్లో తమకు చోటెక్కడో తేల్చమని చీపురుకట్టలు నిలదీస్తున్నట్టు ఒక భావన ఆవరించింది. 
జీవన ప్రాధాన్యతలను తొక్కేసి మనుషుల్ని సింగపూరు డాలర్లకీ అమెరికా డాలర్లకీ ఎడాపెడా తాకట్టు పెట్టేస్తున్న విధానాల్ని తరిమెయ్యడానికి చీపురు కట్టల్ని తిరగెయ్యాలన్నంత కోపం కలిగింది.